King Cobra Vs Mongoose: కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మధ్య భీకర యుద్ధం.. చివరకు గెలిచిందెవరో..?

King Cobra – Mongoose Fight: కింగ్ కోబ్రా, తెల్లతోక ముంగిస రెండు అత్యంత ప్రమాదకరమైనవి. ప్రత్యేకతలు, సామర్థ్యాలు ప్రకృతిలో భిన్నంగా ఉంటాయి. రెండింటికీ అసలు పడదు. రెండు ఎదురైతే ఇక కొట్లాటే. రెండు కొట్లాడుతుంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. నిజానికి రెండు ఎదురుపడి కొట్లాడితే ఏది గెలుస్తుంది? దీనికి ముందు కింగ్ కోబ్రా, ముంగిస గురించి తెలుసుకుందాం.
కింగ్ కోబ్రాలు 12 నుంచి 19 అడుగులు..
కింగ్ కోబ్రాలు సాధారణంగా 12 నుంచి 19 అడుగులు ఉంటుంది. సుమారు 8 నుంచి 9 కేజీల బరువు కలిగి ఉంటాయి. ముంగిసలు 103 సెంటీమీటర్ల వరకు గరిష్ఠంగా పొడవు ఉంటుంది. వీటి బరువు 4 నుంచి 5 కిలోల మధ్య ఉంటుంది. వేగం, లాఘవం విషయానికి వస్తే పాములు క్విక్‌గా స్పందిస్తాయి. కానీ, చురుకుగా ఉండవు. తెల్ల తోక ముంగిసలు మాత్రం అత్యంత వేగంగా స్పందించడమే కాక, లాఘవంగా ఉంటాయి. వాసనను పసిగట్టడంలో కింగ్ కోబ్రా దిట్ట. మొత్తంగా చురకుగా ఉండదు. ముంగిస మాత్రం వినేయగలదు. పదునైన చూపు కలిగి ఉంటుంది. వాసనలు బాగా పసిగడుతుంది. ప్రమాదాలను పసిగట్టడం, ఎదుర్కొవడం చేస్తుంది.
కింగ్ కోబ్రా, ముంగిస లక్షణాలు..
కింగ్ కోబ్రా కాటు వేస్తే న్యూరోటాక్సిక్ విషం విడుదలవుతుంది. ముంగిసకు విషం ఉండదు. అది కొరుకుతుంది. కొరికితే బలంగా ఉంటుంది. పాము కాటు వేయడానికి మాత్రమే కొరుకుతుంది. ముంగిస కొరుకుతే తీవ్రస్థాయిలో గాయం వేస్తుంది. పాము విషం, ప్రత్యేకించి కోబ్రా విషాన్ని సైతం తట్టుకోగలదు.
బలంగా దాడి చేయడం, విషం వెదజల్లి రక్షించుకోవడం కింగ్ కోబ్రా లక్షణం. వేగంగా స్పందించడం, లాఘవంగా దాడి చేయడం, దాడి నుంచి తప్పించుకోవడం ముంగిస లక్షణం. కింగ్ కోబ్రాకు చిక్కితే కాటుతో ముంగిస కూడా చనిపోగలదు. దానికి ఉన్న తెలివి, కింగ్ కోబ్రా తలపైనే టార్గెట్ చేసి దాడి చేస్తుంది. తనను తాను కాపాడుకునే ఎత్తుగడలు, 28 పళ్లను ఉపయోగించి కొరికే శక్తి ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో ముంగిసనే విజయం సాధిస్తుంది.