Kadiri Issue : కదిరిలో వైసీపీ – టీడీపీ రాజకీయ రగడ.. సీన్ లోకి అర్బన్ సీఐ మధు.. అసలు ఏం జరిగిందంటే?
గత వారం రోజుల్లో గన్నవరం, బేతంచర్లలలో జరిగిన గోడవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కదిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
Kadiri Issue : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారతాయి ఏమో అనే భయం ఇప్పుడు సామాన్య ప్రజల్లో నెలకొంటుంది. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే రాజకీయాల కారణంగా తీవ్ర వివాదాలు తలెత్తుతున్నాయి. గత వారం రోజుల్లో గన్నవరం, బేతంచర్లలలో జరిగిన గోడవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కదిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
అసలు ఏం జరిగింది అంటే..
సై అంటే సై అంటూ టీడీపీ, వైసీపీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దాడులు, ప్రతి దాడులతో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో.. ఎప్పుడేం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లలో భాగంగా ఆలయం చుట్టు పక్కల ఉన్న దుకాణాలు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ దుకాణాలను తొలగించకుండా మున్సిపల్ అధికారులను ఆయన అడ్డుకున్నారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణకు దారి తీసింది.
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట, రాళ్ల దాడి జరిగింది. కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొందరు టీడీపీ శ్రేణులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో సీఐ మధు, టీడీపీ మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ మహిళను సీఐ మధు అసభ్యపదజాలంతో దూషించారని గొడవ జరిగింది. పోలీసులు కొట్టడంతో తలపై పలువురు బాధితులు గాయాలతో రక్తమోడుతూ కనిపించారు. సీఐ వీరంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియా పైనా పోలీసులు దాడికి దిగారు. కొందర్నీ బూటుకాళ్లతో కూడా తన్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ ఘటనలో పలువురు స్థానికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనలో గమనించాల్సిన మరో విషయం ఏంటి అంటే సీఐ మీసం మేలేస్తూన్న సమయంలో ఒక వ్యక్తి భుజాల పైన ఉన్నారు. సీఐని భుజాల పైన మోస్తున్న వ్యక్తి వైసీపీ కార్యకర్త అని సమాచారం అందుతుంది.
సీఐ మీసాలు తిప్పి, తొడ కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్న తెదేపా నేతలు..
ఈ మేరకు టీడీపీ మహిళా సంఘం నాయకులు సీఐ ఇంటి ముట్టడికి యత్నించారు. విషయం తెలుసుకున్న వైసీపీ వర్గాలు.. సీఐకి మద్దతుగా రంగంలోకి దిగాయి. టీడీపీ శ్రేణులకు వ్యతిరేకంగా చెన్నై హైవే పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, రాళ్ల దాడి జరిగింది. కదిరి సీఐ మధును సస్పెండ్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. సీఐ మీసాలు తిప్పి, తొడ కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఐ తీరు గుండాలు వ్యవహరించినట్టు ఉందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దీంతో ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోకుండా కదిరిలో భారీగా బలగాల మోహరించాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఇవాళ కదిరికి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ వెళ్లనున్నారు. ప్రస్తుత సోషల్ మీడియాలో సీఐ మధు తొడకొట్టి, మీసం మేలేసిన వీడియో వైరల్ గా మారింది. మీడియా పైన కూడా దాడి చేయడాన్ని పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. సీఐ మధుపై విచారణ చేపట్టి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/