Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాసుల వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 26  వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

Daily Horoscope : నేడు ఈ రాసుల వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 26  వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

 

మేషం..

ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. ఐటీ నిపుణులకు విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. సంతానయోగ సూచనలున్నాయి. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృషభం..

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ఆరాటం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.

మిథునం..

ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. పిల్లలు చదువులోనూ, ఉద్యోగ ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆచితూచి మాట్లాడండి. కొన్ని ముఖ్యమైన పనులు బాగా ఆలస్యం కావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.

కర్కాటకం..

వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు, ఐటీ నిపుణులకు అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతగా మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు.

సింహం..

ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది.  ప్రేమ వ్యవహారాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యక్తిగత జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది.

కన్య..

కొన్ని వ్యక్తిగత విషయాల్లో ఇబ్బందులు పడతారు. వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు.  ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం చేస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.

తుల..

రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు.  ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల కొద్దిగా నష్టపోతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. సంతానం లేని వారు సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. సన్నిహితులను ఆర్థికంగా ఆదుకుంటారు.

ఈ రాశి వారికి మొండి బాకీ వసూలు అవుతుంది (Daily Horoscope)..

వృశ్చికం..

మొండి బాకీ ఒకటి అనుకోకుండా వసూలు అవుతుంది. చాలా కాలంగా పీడిస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. అదనపు సంపాదనకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక రంగాల్లో ఉన్నవారు బాగా బిజీ అవుతారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు చికాకు పెడుతుంది.

ధనుస్సు..

సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సహచరులలో కొందరు మీ గురించి చెడు ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మకరం..

ఇబ్బందుల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. అతి ముఖ్యమైన కోర్టు కేసు ఒకటి వాయిదా పడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళవు. ఆర్థిక లావాదేవీలు లాభంచకపోవచ్చు.

కుంభం..

కుటుంబ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెంచుకునేందుకు ఆలోచన చేస్తారు. సమీపబంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలగజేస్తుంది. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మీనం..

నిరుద్యోగులకు మంచి సంస్థలు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇల్లు కొనాలనే ఆలోచన చేస్తారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/