Last Updated:

పవన్ కళ్యాణ్: వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను… పొత్తులపై కుండ బద్దలు కొట్టిన జనసేనాని

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ

పవన్ కళ్యాణ్: వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను… పొత్తులపై కుండ బద్దలు కొట్టిన జనసేనాని

Pawan Kalyan : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవట్లేదు. గెలవనివ్వం. వైకాపా అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత మీది. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు ఈరోజుకీ కట్టుబడి ఉన్నా. భాజపా, తెదేపాకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదని వెల్లడించారు.

వైకాపా నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ము నుంచి కమిషన్లు కొట్టే రకం కాదు. వైకాపా ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రోడ్ల మీదకు వచ్చి పోరాడుతున్నా. అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తా’’ అని పవన్‌ అన్నారు. వారాహిలో ఏపీ రోడ్ల పైన తిరుగుతానని తనను ఎవరు ఆపుతారో చూస్తా అన్నారు. తనను, తన వారాహిని ఆపితే అప్పుడు తానేంటో చూపిస్తాను అని తెలిపారు.

ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అవినీతి చేస్తున్నాడని అంబటిని ఉద్దేశించి ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘అంబటి కాపుల గుండెల్లో కుంపటి. పోలవరం పూర్తి చేయటం తెలియని ఆయన నీటిపారుదల మంత్రి… అంబటి అని తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: