Vijayasai Reddy : విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో విజయసాయిరెడ్డిపై 506, 384, 420,109,467,120(b)రెడ్ విత్ 34 BNS సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 12న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో వారు పేర్కొన్నారు. సీఐడీ జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు ఏంటి, ఫిర్యాదు చేసిందెవరు?. అనేది నోటీసుల్లో ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం.