Summer special trains : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వేసవిలో ఈ రూట్లలో రైళ్ల సర్వీసుల పొడిగింపు

Summer special trains : ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడుపనున్నది. ఈ నెల 24 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. దీంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు టూర్లకు వెళ్లనున్నారు. దీంతో ప్రయాణికుల దృష్ట్యా అదనపు రైళ్లను నడుపనున్నది. తాజాగా విశాఖ- తిరుపతి, భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ మధ్య రైళ్లు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖ-తిరుపతి రైలు నంబర్ 08583 ప్రతి సోమవారం నడుస్తుంది. దీన్ని గడువును మే 5వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08584 మంగళవారం అందుబాటులో ఉంటుంది. జూలై 1వ తేదీ వరకు దీన్ని గడువు పొడిగించారు. మొత్తం 18 ట్రిప్పులు రైళ్లు నడవనున్నాయి. ఏపీలోని దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో రైళ్లు ఆగుతుంది.
భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ రైలు నంబర్ 02811 రైలు మే 24వ తేదీ నుంచి జూన్ 28తేదీ వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణం రైలు నంబర్ 02812 రైలు ప్రతి సోమవారం జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 12 ట్రిప్పులు ఈ రెలు తిరుగుతుంది. ఖుర్దా రోడ్డు, బ్రహ్మపుర, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం, ఎస్‌ఎస్‌ఎస్‌పీ నిలయం, హిందూపురం స్టేషన్లలో రైలు ఆగుతుంది.