TDP Leader murder : ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య

TDP Leader murder : ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి గురయ్యారు. ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో వీరయ్యపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరయ్య చౌదరి హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మంత్రి నారా లోకేశ్ షాక్..
వీరయ్య చౌదరి హత్య వార్త తెలుసుకుని మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్యను దుండగులు హత్య చేయడం దారుమన్నారు. యువగళం పాదయాత్రలో తనతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారని మంత్రి గుర్తుచేసుకున్నారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. వీరయ్య కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
ఎస్పీతో హోంమంత్రి అనిత..
టీడీపీ నేత దారుణ హత్యపై హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. వీరయ్యను చంపిన నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి. వీరయ్య చౌదరి హత్యపై ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగంతో పోలీసు ఉన్నతాధికారులతో హోం మంత్రి అనిత మాట్లాడుతున్నారు.
మంత్రి రవికుమార్ షాక్..
వీరయ్య హత్యపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. వెంటనే అమరావతి నుంచి ఒంగోలుకు బయలుదేరారు.