Lokesh : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్

Lokesh : కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఆదివారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ఫైల్‌పై సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడారు.
16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీలు ఉన్నట్లు ఉన్నట్లు చెప్పారు. జిల్లా పరిషల్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 13,192 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్‌తోపాటు 52 ప్రిన్సిపాల్, 273 పీజీటీ, 1718 టీజీటీ పోస్టుల భర్తీ రాష్ట్ర, జోన్ స్థాయి కోటాలో భర్తీ చేయనున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకునే విధానం..
అభ్యర్థులకు వెబ్‌సైట్ cse.ap.gov.in,apdsc.apcfss.inలో అన్ని వివరాలు పొందుపర్చినట్లు చెప్పారు. అభ్యర్థులు ఈ నెల 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సీబీటీ విధానంలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మెగా డీఎస్సీ-2025 పరీక్షకు సంబంధించిన సమాచారం, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరాలు సంబంధిత వెబ్‌సెట్‌లో అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగడానికి మంత్రి లోకేష్ వీడియో విడుదల చేశారు.