Published On:

Prakasam : ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటు.. ఇద్దరు మృతి

Prakasam : ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటు.. ఇద్దరు మృతి

Prakasam : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సెలవులు కావడంతో పిల్లలు పంట పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో క్రికెట్ ఆడుతున్న పిల్లలు దగ్గరలో ఉన్న ఓ చెట్టు కిందకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడింది. దీంతో ఇద్దరు బాలురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పులుగుజ్జు సన్నీ (16), గోసిపోతల ఆకాశ్ (18) మృతిచెందారు. గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇద్దరు బాలురు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ఇవి కూడా చదవండి: