AP SSC Results : 23న ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాలు.. ఎన్ని గంటలకంటే?

AP SSC Results : ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 23న ఉదయం 10గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలతోపాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పదో విద్యార్థులు ఫలితాలను ap.govt.in/వెబ్‌సైట్‌తోపాటు మన మిత్ర వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 6లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.
మన మిత్రలో రిజల్ట్స్..
పదో తరగతి విద్యార్థులు తమ మొబైల్ ఫోన్‌లోని వాట్సప్‌లో 9552300009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపి విద్యా సేవలను ఎంచుకోవాలి. ఆపై పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. రోల్ నంబర్‌ను నమోదు చేయడం వల్ల రిజల్ట్స్ పీడీఎఫ్ కాపీని పొందవచ్చు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ద్వారా టీచర్లు, స్టూడెంట్స్ లాగిన్ల ద్వారా ఫలితాలు పొందే సౌకర్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.