Published On:

Tirupati : తిరుపతిలో విషాదం.. భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

Tirupati : తిరుపతిలో విషాదం.. భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

Tirupati : తిరుపతి సమీపంలోని మంగళం పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు పడి ముగ్గురు మేస్త్రీలు అక్కడికక్కడే మృతిచెందారు.

 

వివరాల్లోకి వెళ్తే.. తుడా క్వార్టర్స్‌లోని హెచ్‌ఐజీ విభాగంలో ప్లాట్‌ నం-63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. భవన నిర్మాణానికి సంబంధించిన పనులను పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బొటోతొట్టి శ్రీనివాసులు (40), ఒంగోలుకు చెందిన వసంత్‌, కె.శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ చేస్తున్నారు. ఐదవ అంతస్తులో పని జరుగుతున్న క్రమంలో మేరవ కర్రలు ఊడిపోయాయి. ఈ క్రమంలో మాధవ తప్పించుకున్నారు. మిగిలిన ముగ్గురు పైనుంచి కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘటనా స్థలానికి పోలీసు, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను రుయా ఆసుపత్రికి తరలించారు.

 

 

ఇవి కూడా చదవండి: