Amaravati : రేపు ఏపీలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం.. ఆదేశాలు జారీ చేసిన పోలీసులు

AP Police restrictions : ఏపీలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 2న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే అమరావతి పరిధిలో ఎగరవేతపై నిషేధం విధించారు. ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
రేపు ఏపీ ప్రధాని రాక..
ప్రధాని మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణ పనులను పున: ప్రారంభించనున్నారు. సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్టుకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రుల నివాస సముదాయాలు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు.
మిసైల్ టెస్ట్ రేంజ్‌కు శంకుస్థాపన..
నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో యూనిటీ మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రూ.3,680 కోట్ల నేషనల్ హైవే పనులు ప్రారంభించనున్నారు. కాజీపేట–విజయవాడ 3వ లైన్ ప్రారంభం కానుంది. గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేయనున్నారు.
గంట పర్యటన..
మోదీ రేపు ఏపీలో గంట 25 నిమిషాలు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:25గంటలకు రానున్నారు. సభా వేదికపై 14 మంది హాజరు కానున్నారు. మొదట మంత్రి నారాయణ ప్రసంగిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. చివరిగా ప్రధాని మోదీ ప్రసంగంతో సభ ముగిస్తుంది. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని సభకు రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది.