Ranganayaka Sagar : సిద్దిపేట జిల్లాలో విషాదం.. రంగనాయకసాగర్‌లో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

Ranganayaka Sagar : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో మునిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను మిరాజ్ (15), అర్బాస్ (15)గా గుర్తించారు. వరంగల్‌కు చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో రంగనాయక్ సాగర్ వద్ద రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆగారు. ఈ క్రమంలోనే సరదాగా ఈత కొడుతున్నారు. దీంతో ఇద్దరు పిల్లలు నీట మునిగారు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు పిల్లల కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. కొద్దిసేపటి తర్వాత మిరాజ్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు సమాచారం ఇవ్వగా, వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. అర్బాస్ మృతదేహం కోసం గాలిస్తున్నారు.
వేసవి సెలవులు కావడంతో రెండు కుటుంబాలు శనివారం రంగనాయక సాగర్ రిజర్వాయర్ చూసేందుకు వెళ్లారు. రిజర్వాయర్ వద్ద రెండు కుటుంబాలకు చెందిన పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో నీళ్లల్లో దిగారు. దీంతో బాలుడు, బాలిక నీటిలో గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. రిజర్వాయర్ వద్దకు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.