Last Updated:

Jana Nayagan Release Date: దళపతి విజయ్‌ చివరి సినిమా ‘జననాయగన్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Jana Nayagan Release Date: దళపతి విజయ్‌ చివరి సినిమా ‘జననాయగన్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Thalapathy Vijay Jana Nayagan Release Date: కోలీవుడ్‌ స్టార్ హీరో, దళపతి విజయ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జననాయగన్‌’. తెలుగులో జననాయకుడు. ఇది విజయ్ చివరి చిత్రమని టాక్. దీంతో ఈ మూవీ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్‌ 69వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజులు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇందులో శ్రుతి హాసన్‌ అతిథి పాత్రలో కనిపించనుందని టాక్‌. ఇక విజయ్‌ రాజకీయ ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయ్‌ పోటీ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్‌ ఎంట్రీకి ఈ సినిమా ప్లస్‌ అయ్యేలా దర్శక-నిర్మాతలు భారీ ఎత్తున్న ఈ సినిమాను ప్లాన్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లోపు ఈ సినిమా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఆ దిశ షూటింగ్‌ని కూడా శరవేగంగా ముందుకు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది మూవీ టీం. 2026 సంక్రాంతి సందర్భంగా మూవీ రిలీజ్‌ డేట్‌ లాక్‌ చేశారు. పొంగల్‌ పండుగకు అభిమానులకు కానుకగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇదే విషయాన్ని తెలుపుతూ విజయ్ కూడా తన ట్విటర్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌, ప్రియమణి, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌తో పాటు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.