Published On:

CSK vs SRH: చెపాక్ లో గెలిచిన హైదరాబాద్

CSK vs SRH: చెపాక్ లో గెలిచిన హైదరాబాద్

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ సత్తా చాటింది. ప్లే ఆప్స్ లో అవకాశాలను నిలుపుకుంది. చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టును ఓడించి హైదరాబాద్ చరిత్ర సృష్టించింది.

 

చెన్నై నిర్దేషించిన 154పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బ్రెవిస్ 42, ఆయుష్ 30 పరుగులు చేయండంతో చెన్నై ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. ఈ సీజన్ లో చెన్నై బ్యాటింగ్ లైనప్ పేలవంగా ఉంది.  ఒక్క భారీ ఇన్నింగ్స్ లేకపోవడ గమనార్హం.

 

హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కమిన్స్ నిర్ణయం సరైనదేనంటూ ఇన్నింగ్స్ మొదటి బంతికే షమీ చేతికి చిక్కాడు  చెన్నై ఓపెనర్ షేక్ రషీద్. స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆయుష్ 6 ఫోర్లతో 19 బంతుల్లో  30 పరుగులు చేసి చెన్నైకి ఊపిరులూదాడు. అది ఏంతో సేపు నిలువలేదు. కమ్మిన్స్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

 

బ్రెవిన్42పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సులు, ఒక ఫోర్ ఉన్నాయి. టపటపా పడుతున్న చెన్నై వికెట్లను బ్రెవిన్ అడ్డుకట్ట వేశాడు. శామ్9, శివం దుబే12, దీపక్ హుడా22పరుగులు చేశారు. ఈ సీజన్ ధోనీ ఎప్పటిలాగే నిరాశపరిచాడు. 10 బంతుల్లో 6పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. సన్ రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు, ప్యాట్ కమిన్స్, జయదేవ్ 2, షమీ, మెండిస్ చెరో వికెట్లు పడగొట్టారు.

 

154పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.  ఆరంభంలో చెన్నై లాగే తడబడింది హైదరాబాద్. అభిషేక్  రెండో బంతికే డకౌట్ అయ్యాడు. హెడ్, ఇషాన్ కిషన్ కలిసి  స్కోరు బోర్డును మెల్లిగా కదిలించారు. హెడ్ 16బంతుల్లో 19 స్కోర్ చేయగా, ఇషాన్ కిషన్ 44 పరుగులు చేశాడు. కామిందు 32, నితీష్ కుమార్ రెడ్డి 19పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో నూర్ 2వికెట్లు, ఖలీల్, అన్షుల్, జడేజా ఒక్కో వికెట్ తీశారు.

 

హైదరాబాద్ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మిగిలిన మ్యాచుల్లో అన్నింట్లో గెలిస్తే ఫైనల్ కు చేరే అవకాశం ఉంది.