Last Updated:

SS Rajamouli: SSMB29 రాజమౌళి సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ – సింహాన్ని లాక్‌ చేసిన జక్కన్న, మహేష్‌ బాబు రియాక్షన్‌ చూశారా!

SS Rajamouli: SSMB29 రాజమౌళి సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ – సింహాన్ని లాక్‌ చేసిన జక్కన్న, మహేష్‌ బాబు రియాక్షన్‌ చూశారా!

SS Rajamouli Big Upadte on SSMB29: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబోలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మహేష్‌ 29వ సినిమా చిత్రమిది. ఇప్పటి సినిమాను గ్రాండ్‌ లాంచ్‌ చేసింది మూవీ టీం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సైతం చిత్రం బ్రందం షేర్‌ చేయలేదు. కానీ సీక్రెట్‌ SSMB29 మూవీ పనులు మాత్రం మొదలైనట్టు సినీవర్గాల నుంచి సమాచారం.

ఇప్పుడు ఇదే విషయాన్ని జక్కన్న స్పష్టం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ మూవీ షూటింగ్‌ మొదలైందని చెప్పకనే చెప్పారు. ఇక దీనికి మహేష్‌ కూడా స్పందించడంతో ఈ ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. సింహాన్ని లాక్‌ చేసిన వీడియో షేర్‌ చేస్తూ పాస్‌ పోర్ట్‌ చూపించారు. దీనికి క్యాప్చర్డ్‌ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనికి మహేష్‌ “ఒక్కసారి కమిట్‌ అయితే నా మాటే నేనే వినను” అంటూ కామెంట్‌ చేశాడు. ఆ తర్వాత ప్రియాంక చోప్రా ఫైనల్లీ అంటూ కామెంట్‌ చేసింది. దీంతో మూవీ షూటింగ్‌ మొదలైనట్టే అని తేలిపోయింది. ఈ సినిమా షూటింగ్‌ కోసం ఫారిన్‌ వెళ్తున్నట్టు జక్కన్న హింట్ ఇచ్చేసాడు. ఇక సింహాన్ని లాక్‌ చేస్తున్న వీడియో ఇది అడవుల నేపథ్యంలో సాగే కథ అని స్పష్టం అవుతుంది.

ఇది చూసి మహేష్‌ ఫ్యాన్స్‌ అంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇక వేట మొదలైందంటూ సోషల్‌ మీడియాలో జక్కన్న, మహేష్‌ బాబుల పోస్ట్స్‌తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈసినిమా ప్రియాంక చోప్రా హీరోయిన్‌ అని తేలిపోయింది. ssmb29లో ప్రియాంక హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్టు ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఆమె హైదరాబాద్‌ రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు ఆమె కామెంట్‌ ఇక ఫుల్‌ క్లారిటీ వచ్చిందంటున్నారు నెటిజన్స్‌. జక్కన్న పోస్ట్‌కి ఆమె ఫైనల్లీ అనే కామెంట్‌ చేయడం ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్‌ ఎవరనేది తేలిపోయినట్టు అంటున్నారు.