Published On:

SSMB29: డైనోసార్ తో మహేష్ ఫైట్.. ఏం ఫీల్ ఉంది మావా .. థియేటర్లో పూనకాలే.. ?

SSMB29: డైనోసార్ తో మహేష్ ఫైట్.. ఏం ఫీల్ ఉంది మావా .. థియేటర్లో పూనకాలే.. ?

SSMB29: ఎప్పుడెప్పుడు మొదలవుతున్నా అని రెండు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న  SSMB29 ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను ఫినిష్ చేసుకోని సెట్స్ మీదకు వెళ్ళింది. పెద్ద సినిమాలను కూడా లీకుల నుంచి ఆపలేకపోతుంది ఇండస్ట్రీ. ఇప్పటికే SSMB29 నుంచి లీకైన పోస్టర్స్ , వీడియోల్లో మహేష్ బాబు లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆర్ఆర్ఆర్ తరువాత  జక్కన్న నుంచి వస్తున్న చిత్రం కావడం.. మొట్టమొదటిసారి మహేష్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

 

ఇక ఈ సినిమా కోసం మహేష్ ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో అందరికీ తెల్సిందే. మేకోవర్ మొత్తం మార్చేశాడు. ఫుల్ గడ్డం, జుట్టుతో సింహంలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలకు థియేటర్స్ లో గూస్ బంప్స్ వస్తాయని టాక్ నడిచింది.

 

ఇక ఇప్పుడు SSMB29లో హైలైట్ అంటే.. డైనోసార్ ఫైట్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. జక్కన్న సినిమాలు అంటే జంతులతో హీరో ఫైట్ సీన్ కచ్చితంగా ఉంటుంది. ఫ్యాన్స్ పల్స్ తెల్సిన జక్కన్న హీరోకు ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తే.. థియేటర్ లో పూనకాలు వస్తాయో చెప్పవనవసరం లేదు. అందుకే ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ కు పులికి ఫైట్ పెట్టాడు. ఇక ఇప్పుడు మహేష్ కోసం ఏకంగా డైనోసార్ నే దింపుతున్నాడట.

 

అడవి నేపథ్యంలో ఒక సీన్ ఉంటుందట. ఆ సీన్ లో మహేష్ వెనుక డైనోసార్ పరిగెడుతుందట. తప్పించుకున్నతవరకు తప్పించుకున్న మహేష్ చివరికి డైనోసార్ తో ఫైట్ చేసి దాన్ని మట్టికరిపిస్తాడని టాక్. ఇదే కనుక నిజమైతే థియేటర్లో ఫ్యాన్స్ కాలర్లు ఎగరేసి రచ్చ చేయడం ఖాయం. ఈ ఎపిసోడ్ కోసం చిత్ర బృందం ఆఫ్రికా అడవులకు వెళ్లనున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.