Saif Ali Khan: అసలు ఆ రోజు ఏం జరిగిందంటే.. దాడి ఘటనపై సైఫ్ స్టేట్‌మెంట్ నమోదు చేసిన పోలీసులు
Police Recorded Saif Ali Khan Statement: ఇటీవల దుండిగుడి దాడిలో గాయపడిన సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన దాడి ఘటనపై పోలీసులకు తన వాగ్మూలనం ఇచ్చారు. దాడి జరిగిన రోజు అసలేం జరిగిందనేది ఆయన స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. తాను కరీనా గదిలో పుడుకుని ఉన్నామని, సడెన్ జేహ్ కేర్‌టేకర్ కేకలు వినిపించడంతో బయటకు వచ్చామన్నారు. అయితే తెల్లవారు జామున రెండు గంటలకు సైఫ్‌పై దాడి జరగగా ఆయన ఉదయం 4:11 గంటలకు లీలావతి ఆస్పత్రికి వెళ్లినట్టు వైద్యులు తెలిపారు. అంటే తనపై దాడి జరిగిన గంటన్నర తర్వాత ఆయన ఆస్పత్రికి వెళ్లారు.
ఈ గ్యాప్‌లో ఏం జరిగిందనేది సైఫ్ పోలీసులకు వివరించారు. “నేను కరీనా మా గదిలో పడుకున్నాం. మధ్య రాత్రి ఆకస్మాత్తుగా జేహ్ కేర్‌టేక్ పెద్దగా అరవడం వినిపించింది. ఏమైందని వెంటనే బయటకు వచ్చాం. అప్పటికే దుండగుడు కేర్‌టేకర్‌ని బంధించి బెదిరిస్తున్నాడు. దీంతో నేను అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే అతడు నాపై కత్తితో దాడి చేశాడు. నా వీపు, చేతులు, మెడపై కత్తితో పోడిచాడు. అయినా అతడి గదిలో బంధించాలని చాలా ట్రై చేశాను. కానీ కుదరలేదు. దొంగ తప్పించుకుని పారిపోయాడు” అని సైఫ్ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.
కాగా ఈ నెల జనవరి 16న తెల్లవారు జామున సైఫ్ అలీఖాన్ దుండగుడి చేతిలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన ఒంటిపై ఆరు చోట్లు దుండగుడు కత్తితో దాడి చేశాడు. వీపులో కత్తి మొన విరగడంతో పోలీసులు సర్జరీ చేసి దానిని తొలగించారు. ఇక మెడపై లోతుగా కత్తి పోట్లు ఉండటంతో ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు వైద్యులు తెలిపారు. సైఫ్‌పై దాడి చేసిన దుండగుడి పోలీసులు రెండు రోజుల్లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని బాంద్రా కోర్టులో హాజరుపరచగా.. 6 రోజుల పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు.