Mahesh Babu Emotional Post: మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నా – మహేష్ ఎమోషనల్ పోస్ట్

Mahesh Babu Emotional on His Mother Birth Anniversary: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ తన తల్లి ఇందిరా దేవిని గుర్తు చేసుకున్నారు. ఇవాళ (ఏప్రిల్ 20) మహేష్ తల్లి ఇందిరా దేవి బర్త్‌డే ఈ సందర్భంగా మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
మహేష్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం తెలిసిందే. మొదటి నుంచి కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. షూటింగ్స్ విరామం దొరికితే చాలు భార్య, పిల్లలతో కలిసి విదేశాలకు వెళుతుంటాడు. భార్య, పిల్లలను ఎంతగా ప్రమిస్తాడు.. అంతకు మించి తన తల్లిని అంటే ప్రేమ, అభిమానం, గౌరవం. సందర్భం వచ్చినప్పుడల్లా తల్లితో తనకు ఉన్న అనుబంధాన్ని చెపుతుంటాడు. తండ్రితో కంటే తన తల్లితోనే మహేష్‌కు ఎక్కువ అనుబంధం ఉండేది మమేష్ సోదరి మంజుల ఘట్టమేని పలు సందర్బాల్లో చెప్పారు. ఇక ఆమె బతికి ఉన్నప్పుడు ఎక్కడ ఉన్న వారానికి ఒకసారి తల్లిని కలిసి ఆమెతో స్పెండ్ చేసేవాడు.
ఎంత బిజీ ఉన్న తల్లి మాత్రం తరచూ కలుస్తూనే ఉండేవాడు. పలుమార్లు సినిమా ఈవెంట్స్‌కి కూడా తల్లిని తీసుకుని వచ్చాడు. ఇందిరా దేవి అంటే మహేష్‌కి అంత ఇష్టం. ఇక 2022లో ఇందిరా దేవి మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణం మహేష్‌కు తీరని లోటు అనే చెప్పాలి. అప్పటి నుంచి ఏ సందర్భంగా వచ్చినా ఆమెను గుర్తు చేసుకుంటాడు. ఇక నేడు ఇందిరా దేవి పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. దీనికి ‘హ్యాపీ బర్త్‌డే అమ్మ.. మాటల్లో చెప్పనంతగా నిన్ను మిస్ అవుతున్నా’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్‌గా తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ29(SSMB29) మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఒరిసా అడవి ప్రాంతంలో ఇటీవల ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తర్వాత మూవీ టీంకు బ్రేక్ తీసుకుంది. ఇక ఈ విరామ సమయాన్ని మహేష్ తన ఫ్యామిలీకి కెటాయించాడు. భార్య, పిల్లలతో కలిసి ఇటలీ వెకేషన్‌కు వెళ్లాడు. ఇటీవల వెకేషన్ నుంచి వచ్చిన మహేష్.. త్వరలోనే SSMB29 సెట్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ సినిమా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాలు నటిస్తున్న సంగతి తెలిసిందే.
View this post on Instagram