Published On:

Okkadu Re Release Trailer: మరోసారి బిగ్‌స్క్రీన్‌పైకి మహేష్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ – ‘ఒక్కడు’ రీరిలీజ్ ట్రైలర్ చూశారా?

Okkadu Re Release Trailer: మరోసారి బిగ్‌స్క్రీన్‌పైకి మహేష్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ – ‘ఒక్కడు’ రీరిలీజ్ ట్రైలర్ చూశారా?

Mahesh Babu Okkadu Re Release Trailer Out: సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ఒక్కడు మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్‌ ట్రైలర్‌ని మేకర్స్‌ విడుదల చేసి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మహేష్‌ బాబు, భూమిక హీరోహీరోయిన్లు ప్రకాశ్‌ రాజ్‌ ప్రతి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. గణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికి ఎవర్‌గ్రీన్‌ మూవీ అనే చెప్పాలి. 2003లో సంక్రాంతికి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

 

ఏప్రిల్ 26న రీ-రిలీజ్

ఇప్పటికి టెలివిజన్‌లో ఈ సినిమా వస్తే టీవీలో అతుక్కుపోతారు ఆడియన్స్‌. అంతగా ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 26న మరోసారి బిగ్‌స్క్రీన్స్‌పై రాబోతోంది. దీంతో అభిమానులంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగా ఒక్కడు మూవీ మహేష్‌ బాబు కెరీర్‌లో ఓ మైలురాయి అనే విషయం తెలిసిందే. మురారి, రాజకుమారడు వంటి చిత్రాలు హిట్స్‌ కొట్టిన మహేష్‌కు కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌ని అందించింది మాత్రం ‘ఒక్కడు’ మూవీ. ఓవర్సిస్‌లోనూ ఈ సినిమా సత్తా చాటింది. ఈ మూవీ నుంచే ఓవర్సిస్‌లో మహేష్‌ సినిమాలకు క్రేజ్‌ మొదలైంది.

 

నమ్రత ఆల్‌టైం ఫెవరేట్‌

అలా మహేష్‌ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌కి ఆల్‌టైం ఫెవరేట్‌ అనే తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో మహేష్‌ నటించిన చిత్రాలు ఒక్కడు అని, తాను ఎక్కువ సార్లు చూసిన చిత్రం ఇదే అన్నారు. ఈ చిత్రం హిందీ, తమిళం, కన్నడ బెంగాలి భాషల్లోనూ రీమేక్‌ అయ్యి విడుదలైంది. తమిళంలో విజయ్‌, త్రిషలు జంటగా గిల్లి పేరుతో రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే.

అప్పుడే టికెట్స్ ఓపెన్

ఇప్పటికే ఈ సినిమా రీరిలీజ్‌ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ ఒపెన్‌ అయ్యాయి. హైదరాబాద్‌లోని విశ్వనాథ్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో సంధ్య థియేటర్లలో ఒక్కడు మూవీ టికెట్స్‌ను ఓపెన్‌ చేశారు. టికెట్స్‌ కూడా హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎవర్‌ గ్రీన్‌ క్లాసికల్‌ హిట్‌ కొట్టిన ఈ సినిమా రీరిలీజ్‌లో ఎలాంటి రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం మరింత ప్లస్‌ అయ్యింది. ఇప్పటికి ఒక్కడు పాటలు యూట్యూబ్‌లో మారుమ్రోగుతూనే ఉన్నాయి.