Home / SS Rajamouli
దర్శక ధీరుడు రాజమౌళి.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్దాయికి తీసుకువెళ్లారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన దర్శకత్వం వహించిన RRR చిత్రం దేశవిదేశాల్లో విమర్శకులను మెప్పించింది. గత సంవత్సరం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను అందుకుంది. తాజాగా అకాడమీ అతనిని తన జ్యూరీలో చేరమని ఆహ్వానించింది.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇక “ఆర్ఆర్ఆర్” చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా
తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంశం లేవనెత్తారు. 'మహాభారతం' ప్రాజెక్టును మొదలుపెట్టడానికి సరైన టైం వచ్చిందనే అనుకుంటున్నాననీ, త్వరలోనే మూవీ తీయడానికి కథాపరమైన పరిశీలన మొదలవుతుందని అన్నారు.
మన దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలలో ఆనంద్ మహీంద్ర కూడా ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ టచ్‌లో ఉంటారు. తాజాగా మరోసారి ఆయన చేసిన ట్వీట్ ఫుల్ గా వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ లో ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్లో ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘‘
సెంథిల్ కుమార్ తాజాగా ఆదివారం రాత్రి RRR సక్సెస్ పార్టీ నిర్వహించారు కెమెరామెన్ సెంథిల్ కుమార్. ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు, రామ్ చరణ్, మంచు మనోజ్, భూమా మౌనిక, అడివి శేష్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, మంచు లక్ష్మి, శోభు యార్లగడ్డ.. తదితర సినీ ప్రముఖులు విచ్చేశారు. దానితో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
స్టార్ డైరెక్టర్ జక్కన్న టాలీవుడ్ కు టాటా చెప్తున్నాడన్న వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ వార్తల వెనుకు ఉన్న కారణాలేంటా అని పరిశీలిస్తే ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు హాలీవుడ్ ఫేమస్ దర్శకులు జేమ్స్ కామెరూన్ సహా పలువురు దిగ్గజ హాలీవుడ్ స్టార్స్ ఎస్ఎస్ రాజమౌళిని అభినందించారు. అదే తరుణంలో ఓ హాలీవుడ్ మూవీకి టెక్నికల్ సపోర్ట్ కోసం జక్కన్నతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దానితో జక్కన్న టాలీవుడ్ కు దూరం కానున్నారా అనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడం, రామ్ చరణ్ పుట్టినరోజు, ఉపాసన కామినేని కొణిదెల తల్లికాబోతుండడం ఇలా అన్ని కలిసి రావడంతో మెగాస్టార్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజువేడుకల్లో రాజమౌళి, కీరవాణి, ప్రశాంత్ నీల్, వెంకటేశ్, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
"ఆర్ఆర్ఆర్" సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం పై యావత్ భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కీరవాణి మ్యూజిక్ చేశారు. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ అద్బుతంగా ఆలపించిన ఈ పాటని ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ స్టెప్పులతొ ప్రపంచం అంతా ఫిదా అయ్యేలా చేశారు.
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు.