Mahesh Babu Movies Re-Release: రీ రిలీజ్‌లో మహేష్ బాబు చిత్రాల జాతర – నెల రోజుల్లో వరుసగా 5 సినిమాలు

Mahesh Babu Five Movies Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు శుభవార్త. నెల రోజులు వరుసగా థియేటర్లలో మహేష్ సినిమాల జాతర ఉండబోతోంది. ఈ నెల చివరి నుంచి వచ్చే నెల చివరి వరకు ఈ సమ్మర్ మొత్తం మహేష్ బాబు చిత్రాలు థియేటర్లలో ఆడనున్నాయి. కాగా ఈ మధ్య రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఒకప్పుడ కల్ట్ క్లాసికల్ హిట్స్ అందుకున్న చిత్రాలు మరోసారి థియేటర్లలో విడుదల చేసి అభిమానులకు మంచి వినోదం అందిస్తున్నారు.
ఏళ్లు గడిచిన ఇప్పటికే ఎన్నోచిత్రాలు పలుమార్లు రీ రిలీజై థియేటరల్లో అదే జోరు చూపించాయి. ఏళ్లు గడిచిన రీరిలీజ్‌లోనూ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక రీ రిలీజ్‌లో మహేష్ పోకిరి మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇక ఆయన కెరీర్‌లో బెస్ట్ హిట్ సినిమాలైన ఒక్కడు, ఖలేజా, భరత్ అనే నేనుతో పాటు పలు సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ఈ నెలాఖరు నుంచి మొదలు మే చివరి వరకు నెలరోజుల పాటు మహేష్ సినిమాల జాతర కొనసాగనుంది.
ఒక్కడు
మహేష్ బాబు, భూమిక చావ్లా జంటగా నటించిన ఒక్కడు మూవీకి ఇప్పటికీ అదే క్రేజ్ ఉందనడంలో సందేహం లేదు. మహేష్ కెరీర్‌లో తొలి బిగ్గెస్ట్ హిట్ అందించిన ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రీ రిలీజ్ అయిన ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ఏప్రిల్ 26న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. అంతేకాదు రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది టీం.
భరత్ అనే నేను
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, కియారా అద్వానిలు హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘భరత్ అనే నేను’. పొలిటిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ యంగ్ సీఎం పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2018 ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ వేసవి సందర్భంగా ఏప్రిల్ 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రీ రిలజ్ కానున్నట్టు మేకర్స్ వెల్లడించారు.
ఖలేజా
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ కామెడీ టైమింగ్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. 2010 అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మే 30 ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.
బ్రహ్మోత్సవం
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మహేష్ బాబు-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సమంత, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. ఈ చిత్రం విడుదలై తొమ్మిదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ సినిమా మే 30 రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అతిథి
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు, అమ్రత రావు జంటగా నటించిన చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈచిత్రం మ్యూజికల్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. లవ్, ఎమోషన్‌గా రూపొందిన ఈ చిత్రం ఓ వర్గం ఆడియన్స్‌ని మెప్పించింది. ఇక ఈ చిత్రాన్ని మే 31న మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- Samantha Dating Rumours: ఆ డైరెక్టర్‌తో డేటింగ్ వార్తలు! – తిరుమలలో రాజ్ నిడిమోరుతో కలిసి సమంత మొక్కులు? వీడియో వైరల్