L2 Empuraan Controversy: ‘L2 ఎంపురాన్’ వివాదం – మమ్ముట్టి మాత్రమే సపోర్టు చేశారు: పృథ్వీరాజ్ తల్లి

Prithviraj Sukumaran Mother Mallika Comments on Mammootty: మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ వివాదంలో చిక్కున్నప్పటికీ, కలెక్షన్స్ మాత్రం బాగానే రాబడుతుంది. అయితే ‘ఎల్2’ వివాదానికి కారణం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ అంటూ కొందరు ఆయనపై చేస్తున్న ఆరోపణలను ఆయన తల్లి మల్లిక ఖండించింది. ఈ వ్యవహరంలో తన కొడుకును బలి పశువుని చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు.
ఇది ఓ తల్లి ఆవేదన
“ఇది ఒక తల్లి ఆవేదన… ఎల్2 వివాదంలోపై నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సినిమా దర్శకుడు నా కొడుకు (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే విషయం తప్పా, నాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. అందుకే వివాదాలకు స్పందించకూడదని నేను అభిప్రాయపడ్డాను. కానీ, కొంతమంది ఉద్దేశపూర్వంగా నా కుమారుడిపై నిందలు వేస్తున్నారు. కథలో ఎంపురాన్‌ని తీసుకుని పృథ్వీరాజ్ హీరో మోహన్ లాల్, నిర్మాతలను మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్నారు. పృథ్వీరాజ్ తమను మోసం చేశాడని మోహన్ లాల్ కానీ నిర్మాతలు అనలేదు. వాళ్ళు అలా అంటారని కూడా నేను అనుకోను. మోహన్ లాల్ నాకు తమ్ముడి లాంటివాడు. చిన్నప్పటి నుంచి ఆయన నాకు తెలుసు.
మోహన్ లాల్ నా కొడుకును చాలాసార్లు ప్రశంసించాడు. అయితే వారికి తెలియకుండా కొంతమంది నా కొడుకును బలిపశువుగా చేయడానికి ప్రయత్నించడం తల్లిగా నన్ను ఎన్నో బాధిస్తోంది. పృథ్వీరాజ్ ఎవరినీ మోసం చేయలేదు. రచయిత మురళీ గోపితో సహా ప్రాజెక్ట్‌లోని కీలక సభ్యులందరూ స్క్రిప్ట్ చదివి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి ‘ఎంపురాన్’లో ఏదైనా సమస్య ఉందనుకుంటే దీనికి సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరు బాధ్యత వహిస్తారు” ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
మమ్ముట్టి మెసేజ్ చూసి భావోద్వేగానికి లోనయ్యా
ఆమె పోస్ట్‌పై మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి స్పందించారు. తన పోస్ట్ చూసిన ఆయన స్వయంగా మెసేజ్ చేశారని తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా బిజీగా ఉన్నప్పటికీ మమ్ముట్టి నాకు మెసేజ్ చేశారు. ఈ సినిమా విషయంలో జరుగుతోన్న వివాదం తనని, తన కుటుంబాన్ని బాధిస్తోందన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అందుకు నా పోస్ట్ చూడగానే ఆయన ధైర్యం చెబుతూ మెసేజ్ చేశారు. ఆయన సందేశం చూసి నేను భావోద్వేగానికి లోనయ్యా.
ఆయన నాకెంతో ఓదార్పునిచ్చారు. అదే పృథ్వీరాజ్‌కు చూపించి ధైర్యం చెప్పాను” అని చెప్పుకొచ్చారు. మోహన్‌లాల్‌కు తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించారంటూ పృథ్వీరాజ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో మోహన్ లాల్ ఆడియన్స్‌ని క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. కాగా మార్చి 27న విడుదలైన ‘ఎల్2: ఎంపురాన్’ మూవీ థియేటర్లలో దూసుకుపోతుంది. ఊహించని కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మలయాళ సినిమా రికార్డు నెలకొల్పింది. ఇప్పటికీ ఈ సినిమా అదే జోరుతో థియేటర్లలో కొనసాగుతుంది.