Published On:

Kubera First Song: పోయిరా మామా.. ధనుష్ వాయిస్ కు డీఎస్పీ మ్యూజిక్ తోడైతే..

Kubera First Song: పోయిరా మామా.. ధనుష్ వాయిస్ కు డీఎస్పీ మ్యూజిక్ తోడైతే..

Kubera First Song: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 20 న కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు.

 

తాజాగా కుబేర నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పోయిరా పోయిరా మావా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను ధనుష్ పాడడం విశేషం. ధనుష్ వాయిస్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన పాడిన పాటలు అన్ని సూపర్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ లిస్ట్ లో ఇది కూడా యాడ్ అవుతుందని చెప్పొచ్చు. భాస్కర్ భట్ల రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి.

 

సిట్యువేషన్ ఏంటి అనేది చూపించలేదు కానీ, ధనుష్ తాగి.. డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ధనుష్ డ్యాన్స్, డీఎస్పీ మ్యూజిక్ వెరసి ఈ సాంగ్ రిపీట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు శేఖర్ కమ్ముల సినిమాలో ఇలాంటి ఒక మాస్ బీట్ ను విన్నది లేదు. ఇప్పుడు కుబేర కోసం శేఖర్ కమ్ముల కొత్తగా ట్రై చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మొదటి సాంగ్ తోనే సినిమాపై పాజిటివ్ వైబ్ ను తీసుకొచ్చారు. ధనుష్ మాస్ సాంగ్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పుకొస్తున్నారు. తెలుగులో సార్ తరువాత ధనుష్ చేస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా కుబేర కావడం ఒకటి.. నాగార్జున కీలక పాత్రలో నటించడం మరొకటి.. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కానున్నాయి.మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి: