‘Subham’ first Day Collection: సమంత ‘శుభం’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

Samantha’s Subham Movie 1st Day Collection: హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో నటించింది. చివరిగా ఖుషి చిత్రంతో అలరించి ఆమె ఏడాదిన్నర తర్వాత ‘శుభం’తో వచ్చింది. ఆమె సొంత బ్యానర్ ట్రాలాలా మూవీ పిక్చర్స్‌లో ఫస్ట్ సినిమా శుభం రూపొందింది. దీనికి నిర్మాత వ్యవహరించడమే కాదు ఓ చిన్న పాత్రలో మెరిసింది. మే 9న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం నిరాశ పరిచిందనే చెప్పాలి. ఫస్ట్ డే వసూళ్లను తాజాగా మూవీ మేకర్స్ ప్రకటించారు.
తొలి రోజు ఈ చిత్రానికి రూ. 1.5 కోట్ల మేర గ్రాస్ వసూల్లు వచ్చినట్టు అధికారంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. శుభంతో పాటు అదే రోజు శ్రీ విష్ణు ‘సింగిల్’ మెగాస్టార్ చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి రీరిలీజ్ అయ్యాయి. సింగిల్‌కి ఫస్ట్ డే రూ. 4.15 కోట్లు గ్రాస్, చిరంజీవి కల్ట్ క్లాసిక్ హిట్ జేవీఏఎస్‌లుకు రూ. 1.75 కోట్లు వచ్చాయి. ఈ మూడింటిలో శుభం చిత్రానికి తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. ప్రమోషన్స్ బాగానే చేసింది. అయినప్పటికీ ఆమె క్రేజ్ సినిమా కలెక్షన్ల విషయంలో పనిచేయలేదనే చెప్పాలి. మరి ఈ వీకెంట్ అయిన ‘శుభం’ లాభాల్లోకి వెళ్తుందా లేదా అనేది చూడాలి.
శుభం కథ విషయానికి వస్తే..
కేబుల్ ఆపరేటర్ శ్రీను(హర్సిత్).. శ్రీవల్లి(శ్రియ)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే శ్రీవల్లి ఫస్ట్ నైట్‌ని కూడా పక్కన పెట్టి టీవీ సీరియల్స్‌కి అతుక్కుపోతుంది. అదేంటిన అడిగిన భర్తకు వార్నింగ్ ఇస్తుంది. ఆమె కాదే ఆ ఊర్లోని మహిళలందరిది అదే పరిస్థితి. రాత్రి 9 అయ్యిందంటే ఆ ఊర్లోని మహిళలు వింతగా ప్రవర్తిస్తారు?. అలా సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సాగిన ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకుటుంది. మరి ఇందులో సమంత పాత్ర ఏంటీ? ఆ ఊరి ఆడవాళ్లు అలా ప్రవర్తించడానికి కారేమేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Our small film opens big!! Thank you all for the love and support
keep it coming. #Subham – IN CINEMAS NOW@TralalaPictures @Samanthaprabhu2 #SubhamInTheatres pic.twitter.com/u3604KQ8KO
— Tralala Moving Pictures (@TralalaPictures) May 10, 2025