Published On:

Akkineni Nagarjuna: సినిమా మీదే బ్రో.. కానీ, డామినేషన్ మాత్రం కింగ్ దే

Akkineni Nagarjuna: సినిమా మీదే బ్రో.. కానీ, డామినేషన్ మాత్రం కింగ్ దే

Akkineni Nagarjuna: ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. అందులో ఎవరెవరు నటిస్తున్నారు అనేది ముందే తెలిసిపోతుంది. ఒక సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉంటే.. ఆ హీరో ఫ్యాన్స్ ను బట్టి హైప్ ఉంటుంది. కానీ, కొంతమంది హీరోలు మాత్రం.. ఇంకో హీరో ఫ్యాన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తారు. ఆ సినిమాలో హీరోను డామినేట్ చేసేది మాత్రం ఇంకో హీరోనే. అసలు ఇప్పుడెందుకు వచ్చింది ఇదంతా అంటే.. నిన్ననే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నట్లు మేకర్స్  తెలిపారు.

 

రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూలీ. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఆగస్టు 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన నాగ్.. మొదటిసారి వేరే హీరో సినిమాలో నటిస్తున్నాడు. తెలుగువారు రజినీ సినిమా కోసం ఎంత ఎదురుచూస్తారో అందరికి తెల్సిందే. కానీ, కూలీ మాత్రం కేవలం నాగ్ ఉన్నాడనే చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక నిన్న రిలీజ్ చేసిన వీడియోలో రజినీ కంటే.. నాగ్ నే ఎక్కువ హైలైట్ అయ్యాడు.

 

నాగార్జున స్టైలిష్ మేకోవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.  65 ఏళ్ల వయస్సులో కూడా నాగ్ కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. కౌంట్ డౌన్ వీడియోలో నాగ్ జుట్టు మాత్రమే కనిపించింది. అయినా కూడా రజినీనే డామినేట్ చేశాడు అని తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. రజినీ సినిమా అయినా కూడా అందరూ ఆయనను వదిలేసి.. నాగ్ నే హైలైట్ చేస్తున్నారు.  తమిళ్ తంబీలు కూడా నాగ్ లుక్ బావుందని చెప్పుకొస్తున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సినిమా మీదే బ్రో.. కానీ, డామినేషన్ మాత్రం కింగ్ దే  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.