Published On:

Anushka Shetty: స్వీటీ చేతిలో 7 సినిమాలు.. ఏంటి జోక్ చేస్తున్నారా.. ?

Anushka Shetty: స్వీటీ చేతిలో 7 సినిమాలు.. ఏంటి జోక్ చేస్తున్నారా.. ?

Anushka Shetty: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫిట్ నెస్ అంటే అనుష్క.. అనుష్క అంటే ఫిట్ నెస్ అనే టాక్ ఉండేది. ఏ ముహూర్తాన ఈ చిన్నది సైజ్ జీరో సినిమా చేసిందో కానీ.. అప్పటి నుంచి ఆమె ఆ ఫిట్ నెస్ మొత్తానికి దూరం అయ్యింది. ఆ సినిమా కోసం బరువు పెరిగి.. ఆ తరువాత ఎంత తగ్గాలని ప్రయత్నించినా అది సాధ్యం కాక.. స్వీటీ బొద్దుగానే మిగిలిపోయింది.

 

ఇక మధ్యలో కష్టపడి తగ్గినా అది ఎంతోకాలం నిలబెట్టుకోలేకపోయింది. దీంతో సినిమాలు తగ్గించి, రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తుంది. రెండేళ్ల క్రితం స్వీటీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు ఘాటీ అంటూ రాబోతుంది. ప్రస్తుత్ అనుష్క చేతిలో రెండంటే రెండే సినిమాలు ఉన్నాయి ఒకటి తెలుగులో ఘాటీ అయితే.. ఇంకొకటి మలయాళంలో కథనార్ అనే సినిమ చేస్తుంది.

 

అయితే గత రెండు రోజుల నుంచి అనుష్క చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయని, వాటిని ఎవరికి తెలియకుండా ఆమె పూర్తి చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆమె బరువు తగ్గిందని, ఇక స్వీటీ మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని కూడా రాసుకొచ్చారు. ఇక ఇది విన్న అభిమానులు వావ్ ఇది నిజంగా గుడ్ న్యూస్ అని తెగ సంబరపడిపోతున్నారు. కానీ, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఆమె ఇప్పటివరకు ఎలాంటి కొత్త కథలను ఒప్పుకోలేదట. అసలు స్వీటీకి కొత్త కథలను వినాలనే ఆసక్తి కూడా లేదని ఇన్ సైడ్ వర్గాల టాక్.

 

ప్రస్తుతం అనుష్క కొన్ని శారీరక సమస్యలతో బాధపడుతుంది. బయటకు వస్తే ట్రోల్స్ తో వేధిస్తారని ఆమె కెమెరా కంటికి కూడా కనిపించడం లేదు. అలాంటిది ఒకేసారి 7 సినిమాలు చేస్తుందని చెప్తే ఎలా నమ్మారు అని మరికొంతమంది జోక్ చేస్తున్నారు. అనుష్కను ఒక ఈవెంట్ లో చూసే చాలా కాలం అయ్యింది. ఘాటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తే.. ఆ ప్రమోషన్స్ లో కూడా స్వీటీ కనిపిస్తుంది అనే నమ్మకం లేదు.. అలాంటిది ఇలాంటి పుకార్లు ఎలా నమ్ముతారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే స్వీటీ కెమెరా కంటికి కనిపించే వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి: