Akkineni Nagarjuna: నాగార్జున సోలో హీరోగా కనిపించేది హిట్ డైరెక్టర్ తోనేనా.. ?

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి హీరోగా కాకుండా కీలకపాత్రలు చేయడంలో బిజీగా ఉన్నాడు నాగ్. సీనియర్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే నాగార్జున మాత్రం కొద్దిగా రూట్ మార్చి స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం నాగార్జున చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
ఒకటి రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ అయితే.. రెండోది ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర. ఈ రెండు సినిమాల్లో కూడా నాగార్జున సపోర్టింగ్ రోల్స్ లో కనిపించనున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే ఈ రెండు సినిమాలు కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం నాగార్జున సపోర్టింగ్ రోల్ ల నటించడమే.
ఇక ఈ రెండు సినిమాలు ఓకే చేయడంతో అభిమానులు అందరూ నాగార్జున వీటికే పరిమితమవుతాడా సోలో హీరోగా సినిమా చేసేది లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే నాగ్ సోలో హీరోగా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ మధ్యనే నాగార్జునకు ఒక కథను వినిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథకు నాగర్జున ఓకే చెప్పినట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం శైలేష్ హిట్ 3 రిలీజ్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హిట్ యూనివర్స్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. హిట్ 2 కి హిట్ 3 కి మధ్య శైలేష్.. వెంకటేష్ తో కలిసి సైంధవ్ అనే సినిమా చేశాడు కానీ, ఈ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది.
ఇక ఈసారి హిట్ 3 తర్వాత నాగార్జునతో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే నాగార్జున సినిమాను అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారని వినికిడి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నాగార్జునకు చాలా కాలం తర్వాత ఒక మంచి డైరెక్టర్ దొరికినట్టే అని చెప్పొచ్చు. మరి ఈసారి శైలేష్ .. వెంకీమామ కు ఇచ్చినట్లు ప్లాప్ ఇవ్వకుండా నాగ్ కు హిట్ ఇస్తాడేమో చూడాలి.