Published On:

RAPO22: రామ్ కోసం రంగంలోకి కన్నడ స్టార్ హీరో.. ?

RAPO22: రామ్ కోసం రంగంలోకి కన్నడ స్టార్ హీరో.. ?

RAPO22:ఉస్తాద్ రామ్ పోతినేని ఎప్పటినుంచో ఒక మంచి హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ప్రతిసారి ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే ఉన్నాడు. గతేడాది డబుల్ ఇస్మార్ట్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు. అయితే ఈసారి మాత్రం ఈ వరుస ప్లాప్ లకు ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రామ్ .. మైత్రీ మూవీ మేకర్స్ తో జత కట్టాడు.

 

రామ్ హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం RAPO 22. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సాగర్ అనే కాలేజ్ కుర్రాడి పాత్రలో రామ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

 

అందుతున్న సమాచారం ప్రకారం.. రామ్ కోసం మేకర్స్ కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను రంగంలోకి దించుతున్నారట. మొదటి నుంచి ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉందని, దానికోసం ఒక సీనియర్ స్టార్ హీరో నటించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. మొదట ఈ పాత్రకు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ను తీసుకోవాలని అనుకున్నారట. మరి ఏమైందో ఏమో ఆ పాత్రకు ఉపేంద్రను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

మే 15 రామ్ పుట్టినరోజున ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన తెలుగులో మంచి సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించాడు. సన్నాఫ్ సత్యమూర్తి, గని లాంటి సినిమాలో తన నటనతో మెప్పించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా తన పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుందని అంటున్నారు. ఉపేంద్ర ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా అయినా రామ్ పోతినేనికి విజయాన్ని ప్రసాదిస్తుందో లేదో చూడాలి.