Published On:

Ameesha Patel: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్‌! – బేబీ బంప్‌తో షాకిచ్చిన మహేష్‌ బాబు హీరోయిన్‌..

Ameesha Patel: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్‌! – బేబీ బంప్‌తో షాకిచ్చిన మహేష్‌ బాబు హీరోయిన్‌..

Ameesha patel Her Pregnant Rumours Goes Viral: అమీషా పటెల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ తర్వాత నాని సినిమాలో మహేష్‌ బాబుతో రొమాన్స్‌ చేసింది. ఆ తర్వాత తెలుగులో అమిషా కనిపించలేదు. బాలీవుడ్‌లోనే వరుస సినిమాలు చేసింది. ఐదు పదుల వయసు దగ్గరలో ఈ భామకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో అడపదడపా సినిమాలు చేస్తూ సినీ కెరీర్‌ని నెట్టుకొస్తుంది.

 

ప్రస్తుతం అమీషా పటేల్‌ 49 ఏళ్లు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోయింది. కానీ, ఓ విదేశియుడితో మాత్రం ఈ భామ డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అయితే 49 ఏళ్ల వయసులో అమిషా ప్రెగ్నెంట్‌ అంటూ రూమర్స్‌ వినిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ఆమె షేర్‌ చేసిన ఫోటోల్లో అమీషా.. బేబీ బంప్‌తో కనిపించింది. ఇలా ఆమెను చూసి ఫాలోవర్స్‌, ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అయ్యారు. పెళ్లి కాకుండానే అమిషా బిడ్డకు జన్మనివ్వబోతుందా? అంతా గుసగుసలాడుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు స్లిమ్‌గా కనిపించిన అమిషాకు సడెన్‌ బేబీ బంప్‌ ఎలా పుట్టుకొచ్చిందని, ఇది పబ్లిక్‌ స్టంట్‌ అయ్యుంటుందని సందేహిస్తున్నారు.

 

ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న ఆమె అక్కడ స్వీమ్మింగ్‌ చేస్తూ గ్రీన్‌ కలర్‌ బికీనిలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే ఇందులో ఆమె పొట్ట కాస్త ఎత్తుగా కనిపించింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్‌ అయ్యుంటుందని అని అనుకున్నారు. అయితే అంతకు ముందు ఆమె షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోల్లో మాత్రం పొట్ట ప్లాట్‌గా ఉంది. దీంతో నెటిజన్స్‌ అంతా డైలామాలో పడ్డారు. కాగా అమీషా చివరిగా తౌబా తేరా చల్వా అనే సినిమాలో నటించింది. గతేడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది, అంతకు ముందు బ్లాక్‌బస్టర్‌ మూవీ గద్దర్‌ 2లో నటించింది. ఈ మూవీ సూపర్‌ డూపర్ హిట్‌ కొట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)