Published On:

HIT 3 Ticket Rates: నాని ‘హిట్‌ 3’ టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌..

HIT 3 Ticket Rates: నాని ‘హిట్‌ 3’ టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌..

HIT 3 Ticket Rates Hiked: నేచురల్‌ స్టార్‌ నాని, కేజీయఫ్‌ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హిట్: ది థర్డ్‌ కేస్‌'(HIT 3 Movie). శైలేష్‌ కొలను దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా రేపు(మే 1) విడుదల కానుంది. దీంతో ఈ మూవీ టికెట్ల రేట్‌ పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూవీ టీం విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం ‘హిట్‌ 3’ టికెట్‌ రేట్స్‌ పెంపునకు అనుమతిని ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎప్పుడో రావాల్సి ఈ జీవో కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని మూవీ టీం పేర్కొంది.

 

కాగా సింగిల్‌ స్క్రీన్‌ రూ. 50(GSTతో కలిపి) మల్టీప్లెక్స్‌లో రూ. 75 పెంచుకునేలా వీలు కల్పించింది. సినిమా విడుదలైన నాటి నుంచి వారం పాటు అదనపు ధరలు అమల్లోకి ఉండనుందని ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా నాని సొంత బ్యానర్‌ వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. హిట్‌ సీక్వెన్స్‌ల నుంచి వస్తున్న మూడో చిత్రమిది. హిట్‌, హిట్‌ 2లు మంచి విజయం సాధించాయి. ఒకదానికి మించి ఒకటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్నాయి. దీంతో మూడో పార్ట్‌ భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్‌ 3లో నాని లీడ్‌ రోల్‌ నటించడంతో మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

 

ఇక సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌, పాటలు, టీజర్‌, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా టీజర్‌, ట్రైలర్‌ తర్వాత సినిమాపై హిట్‌ 3పై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇందలో నాని ఇది వరకు ఎన్నడు చూడని వయోలెంట్‌ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇక ట్రైలర్‌ అయితే మిలియన్ల వ్యూస్‌తో రికార్డు బ్రేక్‌ చేసింది. విడుదలైన 24 గంటల్లోనే సుమారు 23 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేశాడు నాని. ఇక రేపు వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతున్న హిట్‌ 3 ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి

120914

ఇవి కూడా చదవండి: