Published On:

Sailesh Kolanu: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు – ‘హిట్‌ 3’ డైరెక్టర్‌ శైలేష్‌ కొలను షాకింగ్‌ ట్వీట్‌

Sailesh Kolanu: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు – ‘హిట్‌ 3’ డైరెక్టర్‌ శైలేష్‌ కొలను షాకింగ్‌ ట్వీట్‌

Sailesh Kolanu Tweet on His Tirumala Darshan: హిట్‌ 3 డైరెక్టర్‌ శైలేష్‌ కొలను ఆ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయనకు అనుహ్యమైన అనుభూతి ఎదురైందట. ఈసారి తిరుమల శ్రీవారి దర్శకతం జీవితంలో ఎన్నడు మర్చిపోనని, అదో అనీర్వచనీయమైన అనుభూతి అన్నాడు. తనకు ఎదురైన ఈ అనుభూతి గురించి ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు.

 

“తిరుమల ఈ రోజు స్వామివారి దర్శనం అద్బుతంగా జరిగింది. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ దర్శనాన్ని అంత ప్రత్యేకం చేసిన నా కొడుకు అభయ్‌కి థ్యాంక్స్‌. గత రాత్రి స్వాతి, నేను మా రూమ్‌లో పడుకుని ఉన్నాం. రాత్రి సడెన్‌గా అభయ్‌ ఏదో మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఏంటాని చూసేసరి సర్‌ప్రైజ్ అయ్యే దృశ్యం చూశాను. అభయ్‌ చేతిలో స్వామివారి కీ చైన్‌ చూశాం. దాన్ని చేతిలో పట్టుకుని స్వామి వారితో మాట్లాడుతున్నాడు. ‘నాతో మా ఇంటికి వచ్చేయ్‌. మాతోనే ఉండిపో’ అంటూ వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నాడు.

 

ఇదంతా చూసి నాకు చాలా ముద్దుగా అనిపించింది. అభయ్‌ ముద్దు ముద్దుగా దేవుడితో మాట్లాడుతుంటే ఆ క్షణం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అలాగే ఈ రోజు ఉదయం దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తున్నాం. సడెన్‌గా అభయ్‌కి అయ్యాగారు(దేవుడు) నుంచి పిలుపువచ్చింది. దీంతో మేము వెనక్కి వెళ్లి మరో 10 నిమిషాల వరకు గర్భగుడిలో కుర్చున్నాం. ఇదంత అనిర్వచనీయంగా జరిగింది. ఈ రోజు దర్శనం నాకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. అభయ్‌కి దేవుడి ఇచ్చిన బహుమతిలా అనిపించింది. నమో వెంకటేశాయ” అంటూ ఆయన తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

 

కాగా శైలేష్‌ కొలను సినిమాల కంటే ముందు డాక్టర్‌గా పని చేశారు. ఆస్ట్రేలియాలో జాబ్‌ చేసిన ఆయన సినిమాలపై ఆసక్తితో ఇండియాకు తిరిగి వచ్చాడు. 2020లో హిట్‌ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఆ తర్వాత హిట్‌ 2 తీసి సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. గతేడాది ఆయన దర్శకత్వంలో సైంధవ్‌ మూవీ చేశాడు. ఇది బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. రీసెంట్‌గా హిట్‌ 3తో మరో బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. త్వరలోనే మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌ రానున్నాడు.