Published On:

HIT 3 Day2 Collection: బాక్సాఫీసు వద్ద నాని సంచలనం – ‘హిట్‌ 3’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

HIT 3 Day2 Collection: బాక్సాఫీసు వద్ద నాని సంచలనం – ‘హిట్‌ 3’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

HIT 3 Movie Day 2 Box Office Collection: నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్‌3: ది థర్డ్‌ కేస్‌’ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోతోనే హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్స్‌ పరంగా హిట్‌3 సంచలనం రేపుతుంది. తొలి రోజే భారీ కలెక్షన్స్‌ చేసి రికార్డు సృష్టించింది. నాని కెరీర్‌లోనే హయ్యేస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చిన ఈమూవీ హిట్‌3 నిలిచింది. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. రెండు రోజుల్లోనే ‘హిట్‌ 3’ హాఫ్‌ సెంచరిని క్రాస్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది.

 

ఈమేరకు మూవీ మేకర్స్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హింట్‌ ప్రాంచైజ్‌ నుంచి థర్డ్‌ కేస్‌గా వచ్చిన ఈ మూవీపై ముందు నుంచి బజ్‌ నెలకొంది. మూవీ ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్లు మూవీ అంచనాలను మరింత పెంచాయి. ఎప్పుడు కూల్‌గా, నేచురల్‌ నటనతో ఆకట్టుకునే నాని ఈ సారి ఫుల్‌ వయోలెన్స్‌లో కనిపించారు. ఇక ట్రైలర్‌ అర్జున్‌ సర్కార్‌ విధ్వంసం చూపించిన మరింత ఆకట్టుకున్నాడు. దీంతో హిట్‌ 3పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక మూవీ హిట్‌ టాక్‌ రావడంతో ఆడియన్స్‌ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

 

దీంతో కలెక్షన్స్‌ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఫస్ట్‌ డే రూ. 43 కోట్ల గ్రాస్‌ చేసిన ఈ చిత్రం రెండోరోజు రూ. 19 కోట్లు రాబట్టినట్టు మేకర్స్‌ ప్రకటించారు. దీంతో హిట్‌ 3 రెండు రోజుల్లోనే రూ. 62 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టి రికార్డు క్రియేట్‌ చేసింది. ఇది ట్రెడ్‌ వర్గాల సైతం సర్‌ప్రైజ్‌ అవుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఫస్ట్‌ వీకెండ్‌లోనే ‘హిట్‌ 3’ వందకోట్ల క్లబ్‌లో చేరడం పక్కా అంటున్నారు. మరోవైపు ఓవర్సిస్‌లోనూ నాని సత్తా చాటుతున్నాడు. రెండు రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్స్‌ అక్కడ రూ. 1.5 మిలియన్ల డాలర్స్‌ క్రాస్‌ చేసింది. ఇప్పటి వరకు నాని నటించిన 11 సినిమాలు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరడం విశేషం. దీంతో ఈ సినిమా వారంలోపే బ్రేక్‌ ఈవెన్‌ సాధించే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచన వేస్తున్నాయి.