Published On:

HIT -3 Collections: నాని ‘హిట్ – 3’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

HIT -3 Collections: నాని ‘హిట్ – 3’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

HIT 3 Movie 1st Day collections: టాలీవుడ్ న్యాచురల్ స్టార్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’. ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ అంచనాలతో మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే నాని కెరీర్‌లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో చిత్రంగా రికార్డుకెక్కింది. ఈ సినిమాలో రావు రమేశ్, సముద్రఖని, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలో నటించారు.

 

ఇక, ఇండియా ఓవర్సీస్‌లోనూ హిట్ 3 తన బాక్సాఫీసు షేక్ చేస్తోంది. అంతేకాకుండా ప్రీ బుకింగ్స్‌లో నాని తన సత్తా ఎంటో మరోసారి చూపించాడు. ఇప్పటికే ఓవర్సీస్‌లో దూకుడుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ మొదటిరోజే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చిది. మరో 3 రోజుల్లో 2 మిలియన్ డాలర్ల వసూళ్లు చేసే ఛాన్స్ ఉందని సినిమా వర్గాల నుంచి సమాచారం.