Published On:

Hit 3: హిట్ 3 ఓటీటీ పార్ట్నర్ లాక్.. ఎందులో స్ట్రీమింగ్ కానుందో తెలుసా.. ?

Hit 3: హిట్ 3 ఓటీటీ పార్ట్నర్ లాక్.. ఎందులో స్ట్రీమింగ్ కానుందో తెలుసా.. ?

Hit 3: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం హిట్ 3 నేడు రిలీజైన విషయం తెల్సిందే. మానవత్వమే లేని పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ గా హిట్ 2 చివర్లో నానిని పరిచయం చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇక హిట్ ను ఆ దేవుడే కాపాడాలి అని హిట్ 2 లో హీరో KD చెప్పడంతోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ మాటలకు తగ్గట్టే.. హిట్ 3 పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు వైలెన్స్ ను నింపేశారు.

 

అసలు ఇలాంటి ఒక రూత్ లెస్ కాప్ రోల్ లో నాని కనిపిస్తాడని ఎవరు అనుకోలేదు. నేడు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన హిట్ 3.. మిక్స్డ్ టాక్ అందుకుంటుంది. కొంతమంది సూపర్ అని అంటుంటే.. ఇంకొందరు యావరేజ్ అంటున్నారు. కుటుంబంతో సహా వెళ్లే వీలు లేదు. ముందు నుంచే ఈ సినిమాకు చిన్న పిల్లలను తీసుకురావద్దని హెచ్చరించారు. థియేటర్ మొత్తం బ్లడ్ బాత్ చేయించాడట నాని. అంత వైలెంట్ గా నానిని ఎప్పుడు చూడలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

 

ఇక చివర్లో హీరో కార్తీ.. ACP వీరప్పన్ గా ఎంట్రీ ఇవ్వడం మరింత హైప్ తీసుకొచ్చిందని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ  హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వరుసగా  నాని హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నాడు. అందుకే డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకే కొనుగోలు చేసిందంట నెట్ ఫ్లిక్స్. అందుతున్న సమాచారం ప్రకారం రూ. 54 కోట్లకు హిట్ 3 డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది.

 

ఈరోజు మిక్స్డ్ టాక్ అందుకున్నా.. రేపు కలక్షన్స్ బట్టి..  హిట్ 3.. హిట్టా.. ? ఫట్టా.. ? అనేది తెలుస్తోంది. హిట్ అయితే కనుక.. మరో పెద్ద సినిమా వచ్చేవరకు ఇది థియేటర్ లో నడుస్తూనే ఉంటుంది. ఒకవేళ యావరేజ్ అయితే కనుక మూడు వారాల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. మరి ఈసారి నాని హిట్ కొట్టాడో.. లేదో రేపు కలక్షన్స్ బట్టి తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: