NBK108 First Look : NBK108 కోసం నయా లుక్ లో బాలయ్య.. ఈసారి అంచనాలకు మించి అంటున్న అనిల్ రావిపూడి
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాధించిన బాలయ్య.. వీరసింహారెడ్డితో అదే జోరుని కంటిన్యూ చేశారు. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.

NBK108 First Look : నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాధించిన బాలయ్య.. వీరసింహారెడ్డితో అదే జోరుని కంటిన్యూ చేశారు. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఇవే కాకుండా అటు కమర్షియల్ యాడ్స్ లోనూ దుమ్ము దులుపుతున్నాడు బాలకృష్ణ.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా NBK108 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి చిత్ర బృందం ఉగాది గిఫ్ట్ ఇచ్చింది. NBK108 నుంచి అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం ఈసినిమానుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు బాలయ్య. ఇక మూవీ టీమ్ ఉగాది కానుకగా అప్ డేట్ ఇస్తామని ముందు గానే ప్రకటించారు. ఈ మేరకు మూవీ టీమ్ తాజాగా ఉగాది సందర్భంగా NBK 108 సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
సీరియస్ లుక్ లో బాలయ్య.. మెలేసిన మీసంతో (NBK108 First Look)..
ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. అన్న దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి అంటూ.. ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య పోస్టర్లను షేర్ చేశారు. ఈ పోస్టర్ లో బాలయ్య సీరియస్ లుక్ లో నిల్చొని మెలేసిన మీసంతో మేడలో కండువా చుట్టుకొని ఉన్నారు. మరో పోస్టర్ లో బాలయ్య పవర్ ఫుల్ గా చూస్తున్నట్టు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారాయి. నందమూరి అభిమనులంతా ఈ ఫోటోలను షేర్ చేస్తూ జై బాలయ్య అని కామెంట్లు చేస్తున్నారు.
Celebrate this UGADI with the Arrival of #NBKLikeNeverBefore
Presenting the FirstLook of Natasimham #NandamuriBalakrishna from #NBK108
This time,beyond your imagination!@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna pic.twitter.com/i1zP90B0aB
— Shine Screens (@Shine_Screens) March 22, 2023
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ పేరును ప్రకటించారు. ఇక బాలయ్య కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాకు ముచ్చటగా మూడోసారి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. కామెడీ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న అనిల్ బాలయ్యను ఎలా చూపించబోతున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని బాలకృష్ణ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- Earth Quake : పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌లలో భారీ భూకంపం.. 11 మంది మృతి, 160 మందికి పైగా గాయాలు
- Mahathma Gandhi Grand Daughter Usha Gokani : మహాత్మ గాంధీ మనుమరాలు ఉషా గోకనీ మృతి..