Published On:

2 King Cobras Love: ప్రపంచాన్ని మరచి రొమాన్స్ లో తెలిపోతున్న కింగ్ కోబ్రాలు!

2 King Cobras Love: ప్రపంచాన్ని మరచి రొమాన్స్ లో తెలిపోతున్న కింగ్ కోబ్రాలు!

15 feet King Cobra Loving on the Roads: ఇటీవల కాలంలో పాములు ఎక్కువగా జనావాసాల్లో తిరుగుతున్నాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఎలుకలు తినడానికి ఇంట్లోకి చొరబడుతున్నాయి. అడవుల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. పాములు కూడా సంభోగం చేస్తాయి. పాములు పంట పొలాల్లో సయ్యాటలు ఆడుతున్న ఘటనలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు భారీ కింగ్ కోబ్రాలు వచ్చాయి. రెండు పాములు సయ్యాట లాడుతూ హల్ చల్ చేశాయి. అక్కడ ఉన్న రైతులు కింగ్ కోబ్రాలను చూసి భయపడ్డారు.

 

మన్యం జిల్లాలో ఘటన జరిగింది. సమీపంలో పంట పొలాలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దీంతో 15 అడుగుల పొడవు ఉన్న రెండు భారీ కింగ్ కోబ్రాలు ఒకే దగ్గరకు చేరి సయ్యాటలాడుకుంటుండగా, రైతులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతమంది రైతులు కింగ్ కోబ్రాలపై టవల్‌ విసిరారు. దీంతో రెండు కోబ్రాలు చెట్లలోకి వెళ్లిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాము కన్నా కింగ్ కోబ్రాలు చాలా ప్రమాదకరం. కాటు వేస్తే బతకడం చాలా కష్టమని డాక్టర్లు చెబుతున్నారు. కింగ్ కోబ్రాలను పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టాలని గ్రామస్తులు ఫారెస్ట్ సిబ్బందిని కోరారు. వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

 

 

ఇవి కూడా చదవండి: