Anil Ravipudi: ఆ హీరోయిన్‌కి నాకు మధ్య.. నా భార్యకు వీడియోలు పంపుతున్నారు, అవి డిలీట్ చేయండి!

Anil Ravipudi Clarifies on Rumours: అనిల్ రావిపూడి.. బ్లాక్‌బస్టర్ హిట్ డైరెక్టర్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఎనిమిదికిపైగా సినిమాలు తీసిన ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ లేదు. అన్ని కూడా సూపర్, బ్లాక్‌బస్టర్ హిట్సే. రీసెంట్‌గా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద రూ. 300లకు పైగా కోట్లు గ్రాస్ చేసింది. పర్ఫెక్ట్ పొంగల్ మూవీగా భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం నేడు టీవీలో, ఓటీటీలోకి వచ్చింది.
అయితే ఈ మూవీ హిట్ సందర్భంగా అనిల్ రావిపూడి వరుస ఇంటర్య్వూలో ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినిమాలు, కెరీర్, సక్సెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డైరెక్టర్ గానే కాదు కుదిరితే భవిష్యత్తులో హీరోగా కూడా చేస్తానన్నాడు. మీరు హీరోగా చేస్తే మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకోండని, మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందంటూ యాంకర్ అనడంతో అనిల్ రావిపూడి షాక్ అయ్యారు.
యాంకర్ మాటలకు స్పందిస్తూ.. తమ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లు లేవంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అంతేకాదు మీనాక్షి, తనకు మధ్య ఏదో ఉందని, మా ఇద్దరి గురించి వీడియోలు చేస్తున్నారని అసహనం చూపించాడు. “మీనాక్షికి, నాకు మధ్య ఎలాంటి కెమిస్ట్రీలు, ఫిజిక్స్ లేవు. ఇప్పటికే మా గురించి యూట్యూబ్‌లో రకరకాలుగా రాస్తున్నారు. నేనేదో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటుంటే.. వీళ్లేమో యూట్యూబ్‌లో వాయిస్ ఓవర్‌తో తమ నచ్చినట్టు కథలు అల్లెస్తూ రాస్తున్నారు. ఆ వీడియోలు నా భార్యకు, కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో పంపిస్తున్నారు. దీనిపై నేను సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేశాను. ఇకనైనా నా మీద స్టోరీలు రాయడం ఆపండి” అని హెచ్చరించాడు.