Last Updated:

Chiru-Anil Movie Update: చిరంజీవి సినిమా – బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన అనిల్ రావిపూడి, త్వరలోనే ‘చిరు’ నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం

Chiru-Anil Movie Update: చిరంజీవి సినిమా – బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన అనిల్ రావిపూడి, త్వరలోనే ‘చిరు’ నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం

Big Update on Chiranjeevi and Anil Ravipudi Movie: మెగాస్టార్‌ చిరంజీవి, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చూడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఊహించని అప్ డేట్

ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అనిల్‌ రావిపూడి ఈసారి తన నెక్ట్స్‌ సినిమా కోసం ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవినే లాక్‌ చేసుకున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక స్క్రిప్ట్‌ వర్క్‌, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి కాగానే సినిమాను సెట్స్‌పైకి తీసుకురావాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు మరికాస్తా సమయంలో పడుతుందేమోనిన అంతా అనుకున్నారు. కానీ వారందరి ఊహాగానాలకు చెక్‌ పెడుతూ అనిల్‌ రావిపూడి ఈ సినిమాపై ఊహించని అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ మేరకు ఓ ట్వీట్‌ వదిలి మెగా సర్ప్రైజ్ అందించాడు.

స్క్రిప్ట్ పూర్తి

“పైనల్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ అయిపోయింది. లాక్‌ చేసేసాం కూడా. చిరంజీవి గారిఇక నా కథలో పాత్ర ‘శంకర్‌ వరప్రసాద్‌’ని పరిచయం చేశాను. ఈ పాత్ర ఆయనకు ఎంతగానో నచ్చింది. స్క్రిప్ట్‌ వింటున్నంతసేపు ఆయన చాలా ఎంజాయ్‌ చేశారు. ఫైనల్‌ కథ విని ఇంకేందుకు లేటు, త్వరలో ముహుర్తంతో పాటు ‘చిరు’ నవ్వుల పండుగబొమ్మకి శ్రీకారం చూట్టేద్దాం” అంటూ ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసారు అని అనిల్‌ రావిపూడి తన పోస్ట్‌లో చెప్పుకోచ్చారు. ఇది విని అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇప్పట్లో ఈ సినిమా సెట్స్‌పైకి రాదనుకుంటున్న వారందరు షాక్‌ అవుతున్నారు. ఈ పొస్ట్‌ చూసి అంతా వెయిటింగ్‌ అంటు కామెంట్స్ పెడుతున్నారు. చిరంజీవి నుంచి ఓ మంచి యాక్షన్‌, కామెడీ చూసి చాలా రోజులైందని, ఈ సినిమాతో వింటేజ్‌ చిరురి చూస్తామా? అంటూ మెగా అభిమానులంతా ఊహాల్లో తేలిపోతున్నారు.

చిరు రియల్ నేమ్ వాడేసిన అనిల్

చిరుతో ఈ సినిమా ప్రకటించిన తర్వాత అనిల్‌ రావిపూడి ఆయన కోసం ఎలాంటి స్క్రిప్ట్‌ రెడీ చేశాడా? అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చట్టబ్బాయి, గ్యాంగ్ లీడర్‌, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు చిత్రాల్లోని చిరంజీవిని ఈ సినిమాల్లో చూస్తారని ఆయన చెప్పుకోచ్చారు. ఇక స్క్రిప్ట్‌ పూర్తి కావడంలో ఫ్యాన్స్‌ అంత పండగ చేసుకుంటున్నారు. వింటేజ్‌ చిరు చూసేందుకు వెయిటింగ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మితం కానుంది. దీనికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. ఇదిలా ఉంటే చిరు అసలు పేరు శివశంకర వరప్రసాద్‌ అనే విషయం తెలిసిందే. ఇందులో శివ పేరు మాత్రమే తొలగించి మిగతాది యధాతథంగా పెట్టేసాడు. ఈ సినిమాలో చిరు అసలు పేరు వాడేసిన అనిల్‌ రావిపూడి మరి ఈ చిత్రంలో ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతున్నారు చూడాలి!