Published On:

High Blood Pressure: లైఫ్ స్టైల్‌లో ఈ మార్పులు చేసుకుంటే.. హైబీపీ సమస్యే ఉండదు !

High Blood Pressure: లైఫ్ స్టైల్‌లో ఈ మార్పులు చేసుకుంటే.. హైబీపీ సమస్యే ఉండదు !

High Blood Pressure: ఈ రోజుల్లో అధిక రక్తపోటు ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దాని ప్రారంభ లక్షణాలను మనం ఈజీగా గుర్తించలేము. ఇది క్రమంగా గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటుకు జన్యువులు, వయస్సు , కొన్ని వైద్య పరిస్థితులు వంటి అనేక కారణాలు ఉంటాయి. ఇవే కాకుండా అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచే కొన్ని అలవాట్లు కూడా ఉన్నాయి.

చెడు జీవనశైలి ఉన్నవారిలో హైబీపీ, లోబీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. తరచుగా అధిక లేదా తక్కువ రక్తపోటు సమస్యలు ఉండవచ్చు. అధిక రక్తపోటుకు కారణమయ్యే కొన్ని సాధారణ అలవాట్లను గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

సమతుల్య ఆహారం: మనం తీసుకునే ఆహారం మన బీపీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం హైబీపీకి కారణం అవుతుంది. ఉప్పు చల్లిన స్నాక్స్, ప్యాక్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్ వేయించిన ఆహారాలలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం, పండ్లు, కూరగాయలు తినక పోవడం కూడా దీనికి కారణమవుతాయి. అసమతుల్య ఆహారం బరువును పెంచుతుంది. అంతే కాకుండా మీ రక్త నాళాలను దెబ్బతీస్తుంది.

 ఒకే చోట కూర్చోవడం: ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి ల్యాప్ టాప్ లు, కంప్యూటర్ల ముందు కదలకుండా కూర్చుంటారు. లేదా శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం లేదా ఏ రకమైన శారీరక శ్రమ చేయకపోవడాన్ని ‘నిశ్చల జీవనశైలి’ అంటారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడం, కండరాలు బలహీనపడటం, గుండె సరిగ్గా పనిచేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో వ్యాయామం గుండెను బలపరుస్తుంది. అంతే కాకుండా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

మానసిక ఒత్తిడి: ఒత్తిడి మన జీవితంలో ఒక భాగం. ఎక్కువగా ఒత్తిడికి గురైనా అది రక్తపోటుకు కారణం అవుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు.. శరీరం ఒత్తిడి హార్మోన్లనువిడుదల చేస్తుంది. ఇవి హృదయ స్పందన రేటును పెంచుతాయి. అంతే కాకుండా రక్త నాళాలను సంకోచించేలా చేస్తాయి. ఒత్తిడి అలాగే కొనసాగితే.. అది క్రమంగా హైబీపీకి శాశ్వత కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఒత్తిడిని నియంత్రించడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.

తగినంత నిద్ర: మన శారీరక ,మానసిక ఆరోగ్యానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. మనం నిద్రపోతున్నప్పుడు.. మన శరీరం ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది . అంతే కాకుండా రక్తపోటును నియంత్రిస్తుంది. ఎక్కువ కాలం తగినంత నిద్రపోకపోవడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. అందుకే 7-8 గంటలు మంచిగా నిద్ర పోవాలి.