Last Updated:

Mahathma Gandhi Grand Daughter Usha Gokani : మహాత్మ గాంధీ మనుమరాలు ఉషా గోకనీ మృతి..

జాతిపిత మహాత్మా గాంధీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించి.. ఎందరికో స్పూర్తిగా నిలిచిన ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే తాజాగా మహాత్మ గాంధీ మనుమరాలు  ఉషా గోకనీ కన్నుమూసినట్లు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల

Mahathma Gandhi Grand Daughter Usha Gokani : మహాత్మ గాంధీ మనుమరాలు ఉషా గోకనీ మృతి..

Mahathma Gandhi Grand Daughter Usha Gokani : జాతిపిత మహాత్మా గాంధీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించి.. ఎందరికో స్పూర్తిగా నిలిచిన ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే తాజాగా మహాత్మ గాంధీ మనుమరాలు  ఉషా గోకనీ కన్నుమూసినట్లు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ముంబై లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం అందుతుంది.

ప్రస్తుతం ఆమె వయసు 89 ఏళ్లు. గత ఐదేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల నుంచి ఆమె మంచానికే పరిమితమయ్యారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె కన్నుమూశారు. ముంబై గాంధీ స్మారక నిధికి గతంలో ఉషా గోకనీ ఛైర్ పర్సన్ గా పనిచేశారు. మహాత్మ గాంధీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమంలోనే ఆమె బాల్యం గడిచింది. కాగా ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.