Ajith Kumar: రేసింగ్ మరోసారి ప్రమాదానికి గురైన అజిత్ – నుజ్జునుజ్జయిన ఇంజన్, వీడియో వైరల్

Ajith Kumar Meet Car Accident Again: తమిళ స్టార్ హీరో అజిత్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు. బెల్జియం కారు రేసింగ్‌లో ఆయన కారు అదుపు తప్పి డివైడర్‌ని ఢీ-కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. కాగా బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా – ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో అజిత్ తాజాగా పాల్గొన్నారు. రేస్ సమయంలో ఆయన నడుపుతున్న కారు కంట్రోల్ తప్పి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
అయితే ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలోనూ పలుమార్లు రేసింగ్ చేస్తున్న సమయంలో అజిత్ కారు ప్రమాదానికి గునైన సంగతి తెలిసిందే. ఇదే ఏడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌లో జరిగిన రేసింగ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఆయన వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అంతకు ముందు జనవరిలో దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా.. ఆయన కారు ట్రాక్ సమీపంలో గోడను ఢీకొని ప్రమాదానికి గురైంది.
అప్పుడు ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్‌గానే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అజిత్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. విడుదలైన ఐదు రోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం తాజాగా రూ. 200 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్ దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. సునీల్, ప్రభు, అర్జున్ దాస్ వంటి తదితర నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
தல அஜீத்குமார் அவர்கள் கார் பந்தயத்தில் விபத்தில் சிக்கி நலமுடன் மீண்டு வந்தார்
#Ajithkumar𓃵 #AjithKumar #AjithKumarRacing #GoodBadUgly pic.twitter.com/3RR4g5p8Up
— Aadhi Shiva (@aadhi_shiva1718) April 19, 2025