Last Updated:

Abhinaya: విశాల్‌తో ప్రేమ.. ఎంగేజ్‌మెంట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన నటి

Abhinaya: విశాల్‌తో ప్రేమ.. ఎంగేజ్‌మెంట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన నటి

Abhinaya: కోలీవుడ్ నటి అభినయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డెఫ్ అండ్ డంబ్ అయినా కూడా అభినయ ఎంతో శ్రద్దగా హావభావాలను పలికించగలదు. తెలుగులో ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటించింది. శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజు గారి గది 2.. ఇలా చాలా సినిమాల్లో ఆమె నటించింది. ఈ మధ్యనే పని అనే సినిమాలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

 

ఇక గత కొంతకాలంగా అభినయ, హీరో విశాల్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అప్పటినుంచి వీరిమధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లిందని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసాయి ఇక ఈ పుకార్లపై అభినయ స్పందించింది.

 

విశాల్ తో పెళ్లి అని కాకుండా తాను లవ్ లో ఉన్నాను అని, తన చిన్ననాటి స్నేహితుడును వివాహాం చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ చిన్ననాటి స్నేహితుడు  కూడా విశాల్ నే అని కొందరు చెప్పుకొచ్చారు. అయితే సడెన్ గా నేడు ఆమె అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. తనకు నిశ్చితార్థం  అయ్యిందని ఆమె తెలుపుతూ ఒక ఫోటోను అభిమానులతో షేర్ చేసింది.

 

అభినయ, తన చిన్ననాటి స్నేహితుడును త్వరలోనే వివాహాం చేసుకోనుంది. నేడు ఆమె ఎంగేజ్ మెంట్ చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది. వరుడు ఫోటోను చూపించకుండా కేవలం రింగ్స్ ఉన్న చేతులను మాత్రమే  చూపిస్తూ ..” గంటలు మోగించండి, ఆశీర్వాదాలను లెక్కించండి – ఈరోజు నుండి  కొత్త ప్రయాణం మొదలుకానుంది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే వీరి వివాహాం జరగనుంది. ఇక ఈ ఫోటోను చూసిన అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు.