Last Updated:

Sreeleela: విశ్వంభర సెట్ లో శ్రీలీల.. చిరు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా.. ?

Sreeleela: విశ్వంభర సెట్ లో శ్రీలీల.. చిరు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా.. ?

Sreeleela: అందాల భామ శ్రీలీల.. విశ్వంభర సెట్ లో సందడి చేసింది. నిన్న మహిళా దినోత్సవం రోజున  ఆమె విశ్వంభర సెట్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక శ్రీలీల రావడంతో చిరంజీవి ఆమెను ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. శ్రీలీలకు వెండివర్ణంతో కూడిన ఒక శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్నీ  శ్రీలీల తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

 

” ఓజీతో నేను. వెండితెరపై మనం ఎంతగానో ఆదరించే మన శంకర్ దాదా MBBS. మహిళా దినోత్సవానికి నాకు ప్రత్యేకమైన బహుమతిని అందించారు. నాకోసం రుచికరమైన భోజనాన్ని తెప్పించారు. ఇంకా నాకు ఉప్మా, దోశలు కావాలి” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

 

ఇక శ్రీలీల కెరీర్ గురించి చెప్పాలంటే.. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను తనవైపుకు తిప్పేసుకున్న ఈ చిన్నది… వరుస అవకాశాలు వచ్చేసరికి ఆలోచించకుండా అన్నింటిని ఓకే చేసేసింది. అయితే అందులో అమ్మడికి హిట్ అందించినవి చాలా తక్కువ.  సినిమాలతో పాటు ఐటెంసాంగ్ కు కూడా ఓకే చెప్పి.. పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ చేసి  కిస్సిక్ గర్ల్ గా మారింది.

 

ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కుర్రహీరోలతో జత కట్టింది. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ లో అమ్మడే హీరోయిన్. వీరిద్దరి కాంబోలో ఎక్స్ట్రా  ఆర్డినరీ మ్యాన్ వచ్చింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాతో ఈ జంట హిట్ కొట్టాలని చూస్తున్నారు.

 

ఇది కాకుండా తమిళ్ లో శివ కార్తికేయన్ నటిస్తున్న శక్తిలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.  ఆకాశం నీ హద్దురా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన  లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవి మోహన్, అధర్వ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ వీడియోలో శ్రీలీల లుక్ ప్రేక్షకులను విశేషముగా ఆకట్టుకుంది.

 

తెలుగు, తమిళ్ కాకుండా ఈ మధ్యనే ఈ చిన్నది హిందీలోకి కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అనురాగ్ బసు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి ఈ సినిమాలతో శ్రీలీల ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.