Last Updated:

RRR: ఆస్కార్ కమిటీలో ఆర్ఆర్ఆర్ టీం.. రాజమౌళి ఎక్కడ బాస్ అంటున్న నెటిజన్లు

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఈ పేరు వింటే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన ఘనత “ఆర్ఆర్ఆర్” సినిమాకే దక్కుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు.

RRR: ఆస్కార్ కమిటీలో ఆర్ఆర్ఆర్ టీం.. రాజమౌళి ఎక్కడ బాస్ అంటున్న నెటిజన్లు

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఈ పేరు వింటే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన ఘనత “ఆర్ఆర్ఆర్” సినిమాకే దక్కుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు. భారత దేశంలో అఖండ విజయం సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా ఎన్నో అవార్డులను సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాలోని నాటునాటు పాటకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డు వరించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి విజయం సాధించిన ఈ చిత్రం మూవీ టీమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ఆస్కార్‌ కమిటీలో అవకాశం లభించింది.

ఆస్కార్ కమిటీలో ఆర్ఆర్ఆర్ టీం(RRR)

ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేసే ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ కొత్తగా ఆస్కార్‌ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు చెందిన ఆరుగురు ఉండడం విశేషం. మన స్టార్‌ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌, అలాగే ఛాయాగ్రాహకుడు సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సిరిల్‌లకు ఈ కమిటీలో స్థానం దక్కింది. దీనితో సోషల్‌ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే మణిరత్నం, కరణ్‌జోహార్‌లకు కూడా ఆస్కార్‌ కమిటీ ఆహ్వానం పలికింది.

అయితే తెలుగు చలనచిత్ర చరిత్రలోనే రికార్డు సాధించిన వీరికి ఆస్కార్‌ కమిటీలో చోటు కల్పించడంపై యావత్ తెలుగు ప్రజానికం మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేస్తుంది. అయితే, దర్శకధీరుడు రాజమౌళికి కూడా స్థానం కల్పించి ఉంటే బాగుండేదంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.