Malayalam Filmmaker: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ కన్నుమూత

Malayalam Filmmaker Shaji N Karun passes away IN 73 Years: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ షాజీ ఎన్ కరుణ్(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షాజీ కరుణ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. డైరెక్టర్‌తో పాటు సినీ ప్రొడ్యూసర్, సినిమాటోగ్రాఫర్‌గా పేరుగాంచిన ఆయన గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు.
షాజీ ఎన్ కరుణ్.. 1973లో తొలిసారిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 1988లో ‘పిరవి’ సినిమాను తెరకెక్కించాడు. ఆయన తీసిన తొలి చిత్రాన్ని సుమారు 70 ఇంటర్నేషనల్ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించడం గమనార్హం. ఇక ఆయన 1994లో తీసిన రెండో సినిమా ‘స్వాహం’ కేన్స్ చలనచిత్రోత్సవంలో పామ్ డి‘ఓర్‌కు నామినేషన్ వేశారు. దీంతో పాటు 1999లో వచ్చిన ‘వానప్రస్థం’ కూడా కేన్స్‌లో ప్రదర్శించారు.
ఇక, డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందిన షాజీకి ఏడు జాతీయ అవార్డులు వరించాయి. అలాగే కేరళ ప్రభుత్వం కూడా ఆయనను పలు అవార్డులతో సత్కరించింది. 2010లో డైరెక్టర్ వహించిన ‘కుట్టి స్రాంక్’ మూవీకి బెస్ట్ చలన చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో పాటు ఫ్రెంచ్ పురస్కారం ఆర్డర్ ఆఫ్ అండ్ లెటర్స్’ వచ్చాయి. అంతేకాకుండా ఆయన కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడబీకి ప్రీమియర్ చైర్మన్‌గా వ్యవహరించడంతో పాటు కేరళ రాష్ట్ర చలనచిత్ర డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు చైర్మన్‌గా చేశారు.
ఇదిలా ఉండగా, ఆయన మలయాళ సినీ పరిశ్రమలో విలక్షణమైన సినిమా డైరెక్షన్ శైలితో పాటు కొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు. మలయాళ సినిమా పరిశ్రమకు నిరంతరం కృషి చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేరళ ప్రభుత్వం ఉన్నత అవార్డుతో సత్కరించించి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అత్యున్నత చలనచిత్ర పురస్కారం‘ జేసీ డేనియల్’ అవార్డుతో షాజీని సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న కొన్ని రోజులకే ఆయన ఇకలేరని వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.