Last Updated:

Oscars 2023: ఆస్కార్ మెన్షన్స్‌ లో నెంబర్ 1 గా ఎన్టీఆర్

ఆస్కార్‌ అవార్డుల సందర్భంగా సోషల్‌ మీడియా, న్యూస్‌ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్‌ మేల్‌ మెన్షన్స్‌)లో..

Oscars 2023: ఆస్కార్ మెన్షన్స్‌ లో నెంబర్ 1 గా ఎన్టీఆర్

Oscars 2023: 95 వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. ఇండియన్ చిత్రాలు ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ అవార్డులతో మురిశాయి. ఎంతో అట్టహాసంగా జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 18.7 మిలియన్‌ మంది వీక్షించారట.

ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన ఏబీసీ ఈ మేరకు గణాంకాలను ప్రకటించింది. గత ఆస్కార్ అవార్డుల కార్యక్రమంతో పోలిస్తే వీక్షకుల సంఖ్య కూడా 12 శాతం పెరిగింది.

అయితే, గతంలో జరిగిన కొన్ని కార్యక్రమాలతో చూసుకుంటే మాత్రం ఈ సంఖ్య తక్కువే.

ఆస్కార్‌ అవార్డులు మొదలైన తర్వాత హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్‌లలో ప్రసారమైన ‘ది లాస్ట్‌ ఆఫ్ అజ్‌’ ఫినాలే ను 8.2 మిలియన్ల మంది వీక్షించారు.

గతంలో నేషనల్‌ ఫుట్‌ బాల్‌ లీగ్‌ ‘సూపర్‌ బౌల్‌’ తర్వాత అత్యధికమంది వీక్షించే కార్యక్రమం ఆస్కార్‌ వేడుక. 2018 వరకు 30 మిలియన్‌ వ్యూవర్స్‌కు ఏమాత్రం తగ్గలేదు.

అయితే, 2014 నుంచి ఈ వేడుకను చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. దీంతో 2021 లో 9.85 మిలియన్‌ వ్యూవర్స్‌కు పడి పోయింది.

గత ఏడాది 16.6 మిలియన్ల మంది ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు.

 

విమర్శల పర్వం(Oscars 2023)

ఆస్కార్‌ వేడుకలను వీక్షించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.

ఆస్కార్ గురించి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ వేడుకను చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేయకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

ఈ ఏడాది ఆస్కార్‌ ఉత్తమ చిత్రం రేసులో రెండు బిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లను సాధించిన ‘టాప్‌గన్‌: మావెరిక్‌’,‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీలు ఉన్నాయి.

ఆ చిత్ర బృందాలు, నటీ నటులు ఎవరూ కనీసం ప్రచారం కూడా చేయలేదు.

మరో వైపు ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 మిలియన్‌ డాలర్లను వసూలు చేసిన ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు ఏడు ఆస్కార్‌లను గెలుచుకుంది.

 

మొదటి స్టానంలో ఎన్టీఆర్

ఆస్కార్‌ అవార్డుల సందర్భంగా సోషల్‌ మీడియా, న్యూస్‌ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్‌ మేల్‌ మెన్షన్స్‌)లో

జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో నిలిచినట్టు సోషల్‌మీడియా విశ్లేషణ చేసే నెట్‌బేస్‌ క్విడ్‌ తెలిపింది. ఎన్టీఆర్ తర్వాత మెగా హీరో రామ్‌చరణ్‌ ఉన్నారు.

ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్‌’ నటుడు కె హుయ్‌ ఖ్యాన్‌, ఉత్తమ నటుడు బ్రెండన్‌ ఫ్రేజర్‌ (ది వేల్‌), అమెరికన్‌ యాక్టర్‌ పెడ్రో పాస్కల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది.

ఆ తర్వాత ‘ది ఎలిఫెంట్‌ ‘విస్పరర్స్‌’, ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’, ‘అర్జెంటీనియా 1985’ చిత్రాలు ఉన్నాయి.

ఇక ఫిమేల్ యాక్టర్స్ విషయానికొస్తే, మిషెల్‌ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్‌, ఎలిజిబెత్‌ ఓల్సెన్‌, జైమి లీ కర్టిస్‌లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి: