Pm Modi : ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన అమెరికన్ గాయని.. భారత జాతీయ గీతాన్ని పాడటం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడి
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పర్యటన ముగింపు కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి
Pm Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పర్యటన ముగింపు కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని మేరీ మిల్‌బెన్ (30) చేసిన పని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వేడుకలో భారత జాతీయ గీతం జనగణమన ఆలపించారు. అనంతరం ఓం జై జగదీశే హరే పాట కూడా పాడారు.
అయితే జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం మేరీ మిల్‌బెన్.. ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జాతీయ గీతం, దేశభక్తి సంగీతాన్ని ఆలపించడానికి తనకు ఆహ్వానం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ కోసం భారత జాతీయ గీతాన్ని పాడటం గౌరవంగా భావిస్తున్నట్లు మేరీ వ్యాఖ్యానించారు. అమెరికన్, ఇండియన్ జాతీయ గీతాలు రెండూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఆదర్శాలను తెలియజేస్తాయని, ఇది అమెరికా-భారత్ సంబంధాల సారాంశమని ఆమె అన్నారు. భారతీయ విలువలు, సంస్కృతి, ఆధ్యాత్మిక భావాలతో మోదీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం పొందారని మేరీ అన్నారు. కాగా అమెరికా పర్యటన ముగియడంతో తదుపరి ఈజిప్టులో పర్యటనకు మోదీ పయనం కానున్నారు.
ఇక మరోవైపు అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. చాలా ప్రత్యేకమైన యూఎస్‌ఏ పర్యటనను ముగించినట్టుగా చెప్పారు. యూఎస్ఏ పర్యటనలో భారత్-అమెరికాల స్నేహం మరింత ఊపందుకోవడం కోసం అనేక కార్యక్రమాలు, పరస్పర చర్యలలో పాల్గొన్నట్టుగా తెలిపారు. రాబోయే తరాలకు మన ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చేందుకు తమ దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తన పర్యటనకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలతో కూడిన వీడియోను కూడా మోదీ షేర్ చేశారు. ఆ వీడియోలో.. మోదీ పర్యటనకి సంబంధించిన పుటేజ్ ని గమనించవచ్చు.
Concluding a very special USA visit, where I got to take part in numerous programmes and interactions aimed at adding momentum to the India-USA friendship. Our nations will keep working together to make our planet a better place for the coming generations. pic.twitter.com/UmATOH3acd
— Narendra Modi (@narendramodi) June 24, 2023