Published On:

Ys Jagan : మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం : వైఎస్‌ జగన్‌

Ys Jagan : మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం : వైఎస్‌ జగన్‌

YSRCP President and former CM YS Jagan : వీర జవాన్‌ మురళీ నాయక్‌ కుటుంబానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పార్టీ తరఫున రూ.25లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం జగన్ గోరంట్ల మండలం కల్లితండాలో మురళీనాయక్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. మురళి త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.

 

జవాను చనిపోతే రూ.50లక్షలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందని చెప్పారు. వైసీసీ పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. దేశం కోసం పోరాడుతూ మురళీనాయక్‌ వీరమరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. మురళీ చేసిన త్యాగానికి దేశం ఎల్లప్పుడు రుణపడి ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భాగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ హామీనిచ్చారు.

ఇవి కూడా చదవండి: