Operation Sindoor: అదంపూర్ ఎయిర్‌బేస్‌కు మోదీ.. సైనికులతో మాట్లాడిన ప్రధాని!

Prime Minister Modi visits Dhampur Airbase: ప్రధాని మోదీ మంగళవారం అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైనికులతో ముచ్చటించారు. పాక్‌పై అటాక్ చేయడంలో అదంపూర్ వైమానిక క్షేత్రం కీలకంగా నిలిచింది. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇవాళ మోదీ ఎయిర్‌బేస్‌కు వెళ్లి ఐఏఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై పాక్ అటాక్ చేయాలని ప్రయత్నించింది. ఈ నెల 9వ తేదీ రాత్రి, 10న పాకిస్థాన్ ప్రయత్నం చేసింది. మోదీ తన ఆకస్మిక పర్యటనతో సైనికుల్లో మనోధైర్యాన్ని నింపారు. వైమానిక సిబ్బందితో పాటు జవాన్లను కలుసుకున్నారు.
సైనిక బలగాలకు భారత్ రుణపడి ఉంటుంది..
అదంపూర్ ఎయిర్ బెస్‌కు వెళ్లిన విషయాన్ని ప్రధాని తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో వెల్లడించారు. ధైర్యసాహాసాలు ప్రదర్శించిన వైమానిక సిబ్బంది, సైనికులను కలుసుకున్నట్లు చెప్పారు. ధైర్యం, అకుంఠిదీక్ష, నిర్భయత్వాన్ని ప్రదర్శించిన వారిని కలుసుకోవడం ప్రత్యేకమైన అనుభవం కలిగిందని మోదీ తెలిపారు. దేశం కోసం శ్రమిస్తున్న సైనిక బలగాలకు ఇండియా రుణపడి ఉంటుందన్నారు.